hyderabadupdates.com movies మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

మణిరత్నం సినిమా… పెర్ఫామెన్సులు పేలిపోతాయ్

నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. మణిరత్నం సినిమాల్లో హిట్లు ఉండొచ్చు, ఫ్లాపులు ఉండొచ్చు. కానీ ఎందులో అయినా నటీనటుల అభినయం మాత్రం అద్భుతంగా ఉంటుంది.

‘అంజలి’ సినిమాలో చిన్న పిల్లల నుంచి కూడా అద్భుతమైన హావభావాలు రాబట్టుకున్న నైపుణ్యం మణిరత్నంది. చివరగా ‘థగ్ లైఫ్’ మూవీతో తీవ్రంగా నిరాశపరిచిన మణిరత్నం.. ఇప్పుడు తనదైన శైలిలో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీయడానికి రెడీ అవుతున్నారు. అందులో విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేస్తున్న విషయం ఇప్పటికే ఖరారైంది. 

తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ఇందులో హీరోయిన్‌గా నటించనుందట. లీడ్ పెయిర్ ఖరారైపోయినట్లు చెన్నై వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. విజయ్ సేతుపతి, సాయిపల్లవికి ఎవరికి వారు ఎంత మంచి పెర్ఫామర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అద్భుత అభినయానికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి.

ఇలాంటి నటీనటులు మణిరత్నం చేతిలో పడితే.. వారి పెర్ఫామెన్స్ ఇంకో లెవెల్‌కు వెళ్తుందనడంలో సందేహం లేదు. సేతుపతి ఇప్పటికే మణిరత్నం సినిమా ‘నవాబ్’లో నటించాడు. అందులో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. సాయిపల్లవి తొలిసారి మణి దర్శకత్వంలో నటించబోతోంది.

చిన్న చిన్న దర్శకుల సినిమాల్లోనే సాయిపల్లవి పెర్ఫామెన్స్ అదరగొట్టేసింది. అలాంటిది మణిరత్నం సినిమాలో అంటే ఆమెకు నటన పరంగా కెరీర్ బెస్ట్ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో సెట్స్ మీదికి వెళ్లబోతున్నట్లు సమాచారం. 

Related Post

క్రిస్మస్ క్లాష్ – అన్నీ మంచి శకునములేక్రిస్మస్ క్లాష్ – అన్నీ మంచి శకునములే

ఏడాది చివరి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సందడిగా కనిపిస్తోంది. మాములుగా ఈ డేట్ లో ఒకటి రెండు పెద్ద మూవీస్ తప్ప తీవ్రమైన పోటీ ఉండేది కాదు. కానీ ఈసారి సీన్ వేరే ఉంది. విశేషమంటే

సిరివెన్నెల విగ్రహం.. జనసేన ఎమ్మెల్యే కీలక పాత్రసిరివెన్నెల విగ్రహం.. జనసేన ఎమ్మెల్యే కీలక పాత్ర

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప గేయ రచయితల్లో ఒకరు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆ మాటకొస్తే దేశంలోనే అత్యుత్తమ లిరిసిస్టుల్లోనూ ఆయన పేరుంటుంది. తెలుగు పాటకు ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. పండితుల నుంచి పామురుల వరకు

త్రివిక్రమ్ ఒరలో అసలు కత్తి ఎవరుత్రివిక్రమ్ ఒరలో అసలు కత్తి ఎవరు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. వెంకటేష్ తో సైలెంట్ గా ఆదర్శ కుటుంబం ఏకె 47 షూటింగ్ చేస్తుండగా ఇప్పుడు మరోసారి ఎందుకు హాట్ టాపిక్ అయ్యారనే సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. అల్లు అర్జున్ ముందు ఓకే