hyderabadupdates.com movies మరో దావోస్ గా హైదరాబాద్?

మరో దావోస్ గా హైదరాబాద్?

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో-అప్ మీటింగ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయాలని కోరారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూల మద్దతు లభించింది.

ఈ హైటెక్ యుగంలో వ్యాపారానికి, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి దావోస్ లో సదస్సు సరిపోదని, మధ్యలో ఒకసారి…దాదాపు 6 నెలల తర్వాత మరో సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు.

దావోస్ లో వార్షిక, హైదరాబాద్ లో అర్ధ-వార్షిక సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని రేవంత్ చేసిన ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తలు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పెట్టుబడులు ఆకర్షించే కేంద్రంగా, మరో దావోస్ గా హైదరాబాద్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్, ఏఐ, లైఫ్ సైన్సెస్, ఇతర రంగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సీఈఓలతో భేటీ అవుతున్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 & ఏఐ హబ్ ఆవిష్కరణ వంటి అంశాలపై చర్చించారు.

Related Post

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరిర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అనుకుంటాం. కానీ రెండో సినిమా బాచితో పెద్ద డిజాస్ట‌ర్ ప‌డ‌డంతో పూరి ప‌రిస్థితి మొద‌టికి

కోరుకున్న ‘భాగ్యం’ దొరికినట్టు ఉందికోరుకున్న ‘భాగ్యం’ దొరికినట్టు ఉంది

మిస్టర్ బచ్చన్ తో తెరంగేట్రం చేసిన భాగ్యశ్రీ బోర్సేకు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి కానీ సరైన హిట్ లేక ఎదురు చూపులు కొనసాగుతూనే వచ్చాయి. విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ కింగ్డమ్ తీవ్రంగా నిరాశపరచగా దుల్కర్ సల్మాన్ కాంత తమిళంలో

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు భారీ అగ్రిమెంట్‌!దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌: చంద్ర‌బాబు భారీ అగ్రిమెంట్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు అనేక పెట్టుబ‌డులు తెచ్చారు. కానీ, మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో చేసుకునే ఓ కీల‌క ఒప్పందం మాత్రం ఆయ‌న రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మార‌నుంది. ఈ విష‌యాన్ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేశారు.