hyderabadupdates.com movies మళ్ళీ మొదలైన కొలికపూడి వాట్సాప్ పంచాయతీ

మళ్ళీ మొదలైన కొలికపూడి వాట్సాప్ పంచాయతీ

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వరుసగా పెట్టే వాట్సాప్ స్టేటస్‌లు, స్థానిక నేతలపై తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. విస్న్నపేట టీడీపీ నేతలను ఉద్దేశించి “నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్‌కా?”, “పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటావ్… నిజంగా రాయల్, కొండపర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్!” అంటూ కసిరిపోయే వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో ఈ పోస్టులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే కొలికపూడి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని వద్ద ఐదు కోట్లు తీసుకున్నారంటూ చేసిన సంచలన ఆరోపణలు టీడీపీలో ప్రకంపనలు రేపాయి. ఆ ఆరోపణలపై చిన్ని ఘాటుగా స్పందించడంతో వివాదం తీవ్రంగా మారింది. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం నివేదిక ఇచ్చి చంద్రబాబుకు అందజేయగా, ఇద్దరినీ పిలిచి పంచాయతీ చేసిన తర్వాత ఆ గొడవ ముగిసింది.

అయితే మళ్లీ ఇప్పుడు స్థానిక నేతలను టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్‌లలో ఆరోపణలు చేయడం పార్టీకి చికాకు కలిగిస్తోంది. నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం, పార్టీకే నష్టం చేసేలా ప్రవర్తించడం అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Post

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు స‌క్సెస్ మీట్లో త‌న కూతురు సుష్మిత గురించి మాట్లాడే క్ర‌మంలో.. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్

పవన్‌తో వారం షూటింగ్ చేసి బయటికిపవన్‌తో వారం షూటింగ్ చేసి బయటికి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇక అప్‌కమింగ్ హీరోయిన్లయితే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ అఖిల్ మూవీ

మంత్రి ముందే గిల్లుకుంటూ, తోసుకున్న మహిళా అధికారులుమంత్రి ముందే గిల్లుకుంటూ, తోసుకున్న మహిళా అధికారులు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఒక ఈవెంట్‌లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వేదికపైనే గొడవ పడటం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో, ఆ ఇద్దరు ఆఫీసర్లు ఒకరినొకరు తోసుకోవడం, గిల్లుకోవడం వంటివి చేయడంతో,