hyderabadupdates.com movies మసూద డైరెక్టర్ ఎక్కడయ్యా?

మసూద డైరెక్టర్ ఎక్కడయ్యా?

తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చి, థియేటర్లలో ఆడియన్స్‌ను గజగజ వణికించిన ఈ సినిమా ఒక బిగ్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఆ తర్వాత ఓటీటీలో చూసి, “అయ్యో ఇంత మంచి హారర్ సినిమాను థియేటర్ లో చూడలేకపోయామే” అని ఫీలయ్యేలా చేశాడు డైరెక్టర్ సాయికిరణ్‌. తన ఫస్ట్ సినిమాతోనే మేకింగ్ స్టైల్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు.

నిజానికి ‘మసూద’ సక్సెస్ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ పై అందరి ఫోకస్ పడింది. కుర్రాడి టాలెంట్ చూసి అప్పట్లోనే నిర్మాతలు భారీ ఆఫర్లతో క్యూ కట్టారు. కానీ సాయికిరణ్ మాత్రం ఎక్కడా తొందరపడలేదు. ఆ మధ్య మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో ఒక ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయని టాక్ వినిపించినా, ఇప్పటివరకు దానిపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. టాలెంట్ ఉంది, మంచి హిట్ కూడా ఉంది.. మరి సెకండ్ సినిమా అనౌన్స్ చేయడానికి ఎందుకు ఇంత టైమ్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక మిస్టరీలా మారింది.

సాధారణంగా ఒక దర్శకుడికి హిట్ వచ్చినప్పుడు, ఆ ఊపులోనే వరుసగా సినిమాలు చేయాలని చూస్తుంటారు. కానీ సాయికిరణ్ మాత్రం కథ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారని ‘మసూద’తో నిరూపించిన ఈ దర్శకుడు, హీరోల డేట్స్ సెట్టవ్వక పోవడం వల్లే ఆలస్యం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత మంచి కథ ఉన్నా, హీరోలు ఓకే చెప్పే వరకు దర్శకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది.

అయితే ఇలా మరీ ఎక్కువగా వెయిట్ చేయడం కూడా కెరీర్ కు రిస్క్ అనే చెప్పాలి. ప్రేక్షకులు ‘మసూద’ వైబ్ ను ఇంకా గుర్తుంచుకున్నప్పుడే మరో థ్రిల్లర్ తో వస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అందరూ అడిగినట్లు ‘మసూద 2’ చేస్తే బాగుంటుంది లేదా కనీసం మరో హారర్ కథతో ముందుకు రావాలి.

ఒకవేళ స్టార్ హీరోలు సెట్టవ్వక పోతే, మళ్లీ కొత్త వారితోనైనా ధైర్యం చేసి సినిమా తీస్తే బెటర్. ఎందుకంటే కంటెంట్ బాగుంటే ‘మసూద’ లాగే ప్రేక్షకులు ఎగబడతారు. ఇప్పటికైనా ఈ లేటు ముచ్చట ఆపేసి, పక్కాగా ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తే బాగుంటుంది. క్రియేటివ్ దర్శకులు ఖాళీగా ఉండటం కంటే కెమెరా ముందు ఉండటమే ఇండస్ట్రీకి కూడా మంచిది.

Related Post

‘మమ్మీ’ అభిమానులకు దెయ్యం షాక్‘మమ్మీ’ అభిమానులకు దెయ్యం షాక్

ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1999లో విడుదలైన ది మమ్మీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రెండో భాగంగా వచ్చిన మమ్మి రిటర్న్స్ సైతం బ్లాక్ బస్టర్ అయ్యింది. జాకీ ఛాన్ ని తీసుకొచ్చి మమ్మీ 3లో నటింపజేస్తే అది