hyderabadupdates.com Gallery మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమార

మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమార

న్యూఢిల్లీ : మ‌హాత్మా గాంధీ మ‌హాశ‌యుడు ఒక్క ఇండియాకే కాద‌ని ఆయ‌న జీవితం యావ‌త్ ప్ర‌పంచానికి స్పూర్తి దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు అసుర కుమార దిశా నాయ‌క‌. మంగ‌ళ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీకి విచ్చేశారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌తిష్టాత్మ‌క ఏఐ వ‌ర‌ల్డ్ స‌మ్మిట్ 2026లో శ్రీ‌లంక దేశం త‌ర‌పున ఆయ‌న హాజ‌ర‌య్యారు. దేశాధ్య‌క్షుడికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ . అనంత‌రం భారీ భ‌ద్ర‌త న‌డుమ మ‌హాత్మా గాంధీ స‌మాధి వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను పునర్నిర్మిస్తున్న తరుణంలో, భారతదేశం – శ్రీలంక భాగస్వామ్యం లోతు , ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు సమ్మిళితంగా, బాధ్యతాయుతంగా ప్రజలపై కేంద్రీకృతమై ఉండేలా చూసుకోవడంలో మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించేలా చేస్తుంద‌న్నారు. శ్రీలంక, భారతదేశం కనెక్టివిటీ, ఆర్థిక నిశ్చితార్థం, డిజిటల్ సహకారం, సామర్థ్య నిర్మాణం , ప్రజల సంబంధాలలో స్థిరమైన ప్ర‌గ‌తిని సాధించాయ‌ని తెలిపారు. దక్షిణాసియా నాయకులలో ఒకరిగా హాజరైన అధ్యక్షుడి భాగస్వామ్యం మా సంబంధం సాన్నిహిత్యాన్ని , భవిష్యత్తును రూపొందించే సమస్యలపై కలిసి పనిచేయడానికి మా నిబద్ధతను నొక్కి చెబుతుందని స్ప‌ష్టం చేశారు.
ఈ సంద‌ర్బంగా శ్రీ‌లంక దేశ అధ్య‌క్షుడు మీడియాతో మాట్లాడారు. ఇండియాతో త‌మ సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. భారతదేశం – శ్రీలంక భాగస్వామ్యం ఉద్దేశ్యంతో అభివృద్ధి చెందుతూనే ఉంటుంద‌న్నారు.
The post మ‌హాత్ముడి జీవితం స్పూర్తి దాయ‌కం : అసుర కుమార appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Indigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతిIndigo: ఇండిగో విమానంలో గుండెపోటుతో వ్యక్తి మృతి

Indigo : జెడ్డా నుంచి శంషాబాద్‌ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానం(6E68 Indigo flight)లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్‌ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మరికొద్ది

AP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటనAP Government: విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన

    విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని… ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం