hyderabadupdates.com movies మారుతీకి మంచి రోజులు రావాల్సిందే

మారుతీకి మంచి రోజులు రావాల్సిందే

సంక్రాంతికి విడుదలైన ది రాజా సాబ్ పేరు వింటే చాలు ప్రభాస్ అభిమానులకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. వీళ్ళ ట్రోలింగ్ దెబ్బకే దర్శకుడు మారుతీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. డిజాస్టర్లు అందరూ తీస్తారు కానీ రిలీజ్ కు ముందు వీళ్ళు చేసిన హంగామా అంచనాలను అమాంతం పెంచేయడం, వాటిని కనీసం సగం కూడా మ్యాచ్ చేయలేని స్థితిలో సినిమా డిజాస్టర్ కావడం ఊహించని పరిణామాలు. ఇదంతా గతం.

శ్రీరామనవమి సందర్భంగా మారుతీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. కొత్త స్క్రిప్ట్ పనులు అయిపోయాయని, ప్రతిదీ నేర్చుకునే పాఠమని చెబుతూ త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్న సంకేతం పూజ రూపంలో ఇచ్చారు. హీరో తదితర వివరాలు ఏమీ చెప్పలేదు కానీ మెగా కాంపౌండ్ కథానాయకుడనే టాక్ అయితే బలంగా ఉంది. హ్యాపీ పొంగల్ టైటిల్ తో వేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో దింపి హిట్టు కొట్టి తానేంటో చూపించాలనేది మారుతీ ప్లానింగ్ గా కనిపిస్తోంది.

రాజా సాబ్ ఒకటే కాదు మారుతీ అంతకు ముందు ట్రాక్ రికార్డు కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. గోపీచంద్ పక్కా కమర్షియల్ కనీసం యావరేజ్ కాలేదు. అంతకు ముందు సంతోష్ శోభన్ తో చేసిన మంచి రోజులు వచ్చాయి సైతం నిరాశపరిచింది. చివరి హిట్టు ఎనిమిదేళ్ల క్రితం 2019లో సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగేతో దక్కింది. సో ఇప్పుడు సాలిడ్ హిట్టు చాలా అవసరం. ముఖ్యంగా రాజా సాబ్ తో పడిన ముద్ర పోవాలంటే చాలా కష్టపడాలి.

ఒకవేళ రాజా సాబ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈపాటికి మారుతీ ప్యాన్ ఇండియా డైరెక్టర్ లిస్టులో చేరిపోయేవారు. కానీ ఛాన్స్ మిస్సయ్యింది. తప్పు ఎక్కడ జరిగింది అనేది పక్కనపెడితే బాధితుడు మాత్రం ఈయనే. ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఫ్యాన్స్ ఇంకో హిట్టు రాగానే పాతవి మర్చిపోతారు. కానీ మారుతీకి అలా కాదు. సాలిడ్ గా ప్రూవ్ చేయాలి. మళ్ళీ మంచి రోజులు వచ్చాయని నిరూపించాలి. మరి పొంగల్ తో అది సాధ్యమవుతుందేమో.

Related Post

టాలీవుడ్… వెయ్యి కోట్ల క్లబ్‌పై కన్నేసిన క్రేజీ మూవీస్టాలీవుడ్… వెయ్యి కోట్ల క్లబ్‌పై కన్నేసిన క్రేజీ మూవీస్

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో టాలీవుడ్ సృష్టించిన ఇంపాక్ట్ తో ఇప్పుడు రాబోయే ప్రతి పెద్ద సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంటోంది. రాజమౌళి, సుకుమార్ వంటి

శుభాభినంద‌న‌ల‌తో…. : సీఎం చంద్ర‌బాబుకు జ‌గ‌న్ లేఖ‌!శుభాభినంద‌న‌ల‌తో…. : సీఎం చంద్ర‌బాబుకు జ‌గ‌న్ లేఖ‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా సీఎం చంద్ర‌బాబు సుదీర్ఘ లేఖ రాశారు. అయితే.. వాస్త‌వానికి సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డే జ‌గ‌న్‌.. ఈ లేఖ‌ను మాత్రం ఒక ప‌ద్ధ‌తిగా “శుభాభినందనలతో” అంటూ.. ప్రారంభించ‌డం విశేషం. అయితే.. లేఖ లోప‌ల

EPIC – First Semester Title Glimpse Promises a Fresh and Heartfelt Love StoryEPIC – First Semester Title Glimpse Promises a Fresh and Heartfelt Love Story

Sithara Entertainments has officially unveiled the title of its much-awaited Production No. 32 as EPIC – First Semester, along with a charming title glimpse that is already drawing attention. The