hyderabadupdates.com movies మాస్ట్రో ఇళయరాజాకు షాకిచ్చిన కోర్టు

మాస్ట్రో ఇళయరాజాకు షాకిచ్చిన కోర్టు

తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ముందుగా ఏం జరిగిందో తెలుసుకుంటే మ్యాటర్ స్పష్టంగా అర్థమవుతుంది.

ఇండియన్ టాప్ మ్యూజిక్ కంపెనీలలో ఒకటైన సరిగమ సంస్థ వద్ద ఇళయరాజా కంపోజ్ చేసిన 134 సినిమాల ఆడియో హక్కులున్నాయి. 1976 నుంచి 2001 మధ్యలో విడుదలైన వీటి నిర్మాతల దగ్గర నుంచి సరిగమ కోరినంత మొత్తాన్ని చెల్లించి శాశ్వతంగా రైట్స్ కొనుగోలు చేసింది. ఈ నెల ప్రారంభంలో రాజా ఈ పాటలను ఐట్యూన్స్, జియో సావన్, ప్రైమ్ మ్యూజిక్ తదితర ప్లాట్ ఫార్మ్స్ లో అప్లోడ్ అనుమతులిచ్చారు.

దీంతో తమకు హక్కులు ఉన్న సినిమా పాటలను ఇళయరాజా సదరు సంస్థలకు ఇచ్చారని సరిగమ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1957 కాపీ రైట్ చట్టం ప్రకారం ఏదైనా నిర్దిష్టమైన ఒప్పందం లేకపోతే మ్యూజిక్ కు సంబంధించిన హక్కులు నిర్మాతకే చెందుతాయి. ఆయన ఎవరికి అమ్మితే వాళ్ళు సొంతదారులవుతారు. ఆ విధంగా సరిగమ వాటికి ఓనర్ అయ్యింది.

ఎన్ ఇనియ పొన్ నిలవే అనే చార్ట్ బస్టర్ సాంగ్ కు సంబంధించిన వివాదంతో ఇళయరాజా, సరిగమ మధ్య గొడవ మొదలయ్యింది. తాజాగా జస్టిస్ తుషార్ రావుగెడేలా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఇళయరాజా సరిగమ దగ్గర ఉన్న పాటలను వాడుకోవడానికి ఉండదు.

దీని మీద లీగల్ గా ఇళయరాజా మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి కానీ ప్రస్తుతానికి మాత్రం స్ట్రోక్ తగిలిందనే చెప్పాలి. అయినా ఒక పాట కంపోజ్ చేసి నిర్మాతకు ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాక ఆటోమేటిక్ గా దాని హక్కులు ప్రొడ్యూసర్ కే దక్కుతాయి. కాపీ రైట్ చట్టం చెబుతోంది ఇదే.

అయితే ఇదే లాలో కొంత సంక్లిష్టత ఉన్న కారణంగా కొందరు సంగీత దర్శకులు, గాయకులు, గీత రచయితలు అప్పుడప్పుడు పోరాడుతూ ఉంటారు. ఒక్క ఇళయరాజా మాత్రమే దీని సీరియస్ గా తీసుకుని చాలా దూరం తీసుకెళ్లారు. మన శంకరవరప్రసాద్ గారు కోసం అడగ్గానే ఉచితంగా అనుమతి ఇచ్చారని ఇటీవలే అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే.

Related Post

ప్రియదర్శి సినిమాకు ప్రచారం లేదేంటిప్రియదర్శి సినిమాకు ప్రచారం లేదేంటి

పెళ్లి చూపులు, జాతిరత్నాలు ఎంత పేరు తెచ్చినా ప్రియదర్శికి మంచి బ్రేక్ గా నిలిచింది బలగం సినిమానే. గత ఏడాది కోర్ట్ రూపంలో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. సారంగపాణి జాతకం

టికెట్ రేట్ల జీవోపై మ‌ళ్లీ కొత్త మాట‌టికెట్ రేట్ల జీవోపై మ‌ళ్లీ కొత్త మాట‌

తెలంగాణ‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు వ్య‌వ‌హారం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై టికెట్ల రేట్లు పెంచ‌బోమ‌ని ఒక‌టికి రెండుసార్లు నొక్కి వ‌క్కాణించారు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఐతే ఇటీవ‌ల సంక్రాంతి సినిమాల‌కు మ‌ళ్లీ రేట్లు

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై అదనపు పన్నులు వేస్తానని హెచ్చరించారు. అయితే ఈ వార్నింగ్ చూసి మన ఎగుమతిదారులు ఏమాత్రం కంగారు పడటం లేదు. ట్రంప్