hyderabadupdates.com movies మాస్ నిర్ణయానికి థాంక్స్ చెప్పాలి

మాస్ నిర్ణయానికి థాంక్స్ చెప్పాలి

ఈ మధ్య బడ్జెట్ తో సంబంధం లేకుండా అవకాశం ఉంటే చాలు టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని నిర్మాతలు బాగా వాడుకుంటున్నారు. అయితే దీనివల్ల లాభం కన్నా నష్టాలు పొందిన వాళ్లే ఎక్కువ. ధరలు అధికంగా ఉన్న కారణంగా యావరేజ్ లు ఫ్లాప్ కావడం, ఫ్లాపులకు డిజాస్టర్ ముద్ర పడటం పరిపాటిగా మారింది. మిరాయ్ కు ఎలాంటి పెంపు లేకుండా రెగ్యులర్ ప్రైసింగ్ పెట్టినా సరే నూటా యాభై కోట్ల గ్రాస్ దాటేసి వావ్ అనిపించింది. కేవలం రేట్ల కారణంగా హిట్ 3 ది థర్డ్ కేస్, తండేల్ లాంటివి తమ పూర్తి పొటెన్షియాలిటీని వాడుకోలేకపోయాయి. ఇక మాస్ జాతరకు కూడా ఇలాగే చేస్తారేమో అనుకున్నారందరూ.

కానీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పెంపుకు వెళ్ళలేదు. హైదరాబాద్ లో ఎలాగూ అనుమతిలో ఉన్న గరిష్ట ధర సరిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. మల్టీప్లెక్సులు 295 రూపాయల దాకా పెట్టుకోవచ్చు. ఎటొచ్చి ఏపీలో ఇది 177 రూపాయలే ఉండటం వల్ల ప్రతిసారి పెంపు కొరక తప్పడం లేదు. కానీ మాస్ జాతరకు అలాంటి రిస్క్ చేయలేదు. విజయవాడ తదితర నగరాల్లో ఓపెన్ చేసిన ప్రీమియర్ షోల బుకింగ్స్ చూస్తే మాములు రేట్లే ఉన్నాయి. అంటే మల్టీప్లెక్స్ లో తెలంగాణలో కంటే వంద తక్కువ ధరలో సినిమా చూసే అవకాశం దక్కడమే కాదు సింగల్ స్క్రీన్ లో 105 రూపాయల బాల్కనీతో ఎక్కువ శాతం చూసే ఛాన్స్ దక్కింది.

నిజానికి మాస్ జాతరకు బడ్జెట్ తక్కువేం కాలేదు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి గట్టిగా ఖర్చు పెట్టారు. యాక్షన్ ఎపిసోడ్లు, క్యాస్టింగ్ కోసం పెద్ద ఎత్తున వ్యయం చేశారు. పైగా క్యాస్టింగ్ కోసం కూడా జేబు తడిసె రేంజ్ లో పారితోషికాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూసుకుంటే పెంపు ఈజీగా అడిగి ఉండొచ్చు. కానీ నిర్మాత నాగవంశీ అటువైపు మొగ్గు చూపించలేదు. డిస్ట్రిబ్యూషన్ చేసిన డబ్బింగ్ మూవీ వార్ 2కి తీసుకున్న హైక్స్ ని మాస్ జాతరకు వద్దనుకున్నారు. అంటే ఎక్కువ శాతం ఆడియన్స్ కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు రవితేజ ఫ్యాన్స్ థాంక్స్ చెప్పడం ఎంతైనా సబబే.

Related Post