hyderabadupdates.com Gallery మా అధినాయ‌కుడిని తిడితే మేం ఊరుకోవాలా..?

మా అధినాయ‌కుడిని తిడితే మేం ఊరుకోవాలా..?

మా అధినాయ‌కుడిని తిడితే మేం ఊరుకోవాలా..? post thumbnail image

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీకి చెంగిన గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గ‌ళ్లా మాధ‌వి నిప్పులు చెరిగారు. వైసీపీ బాస్ జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న ప‌రివారాన్ని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి జ‌రిగింద‌నేది వాస్త‌వ‌మ‌ని, ఇది త‌మ స‌ర్కార్ ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింద‌ని చెప్పారు. ఇందులో భాగంగానే ఆనాడు జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు అకౌంట్స్ ఆఫీస‌ర్ బాలాజీపై కూడా వేటు వేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. కల్తీ నెయ్యి విషయంలో సిట్ నివేదిక ప్రకారం ఫ్లెక్సీలు వేశామ‌న్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తామని బెదిరించి, బూతులు తిట్టిందెవరు అని ప్ర‌శ్నించారు గ‌ళ్లా మాధ‌వి.
అగ్గి రాజేసిన తర్వాత ప్రెస్‍మీట్ పెట్టి మళ్లీ రెచ్చగొట్టింది ఎవ‌రో వాళ్ల మ‌న‌స్సాక్షికి తెలియ‌దా అని నిల‌దీశారు ఎమ్మెల్యే. తాను అంబటి ఆఫీస్ వద్ద ఏం చేశాను.. ఎలా ఉన్నానో వీడియోల్లో ఉందని చెప్పారు. బూతులు తిట్టినప్పుడు కూడా మేం అడగక పోతే ఎలా అంటూ మండిప‌డ్డారు. దాడికి దిగాలంటే నేను రావాల్సిన పని లేదన్నారు గ‌ళ్లా మాధ‌వి. మీరు టీడీపీ కార్యాలయం పైకి వేరేవాళ్లను పంపినట్లు చేసేవాళ్లం అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా సీఎం చంద్రబాబును తిడతారా ఎలా అని భ‌గ్గుమ‌న్నారు ఎమ్మెల్యే. అంబటి కుమార్తెకు ఉన్న భయమే మా ఇంట్లో వారికి కూడా ఉంటుందన్నారు. ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు. త‌న‌ ఇంటి వద్దకు వచ్చిన మహిళను ఎందుకు కొట్టారో మౌనిక చెప్పాలన్నారు. కేవ‌లం తాము సారీ మాత్ర‌మే అడిగామ‌న్నారు.
The post మా అధినాయ‌కుడిని తిడితే మేం ఊరుకోవాలా..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్యYatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య (Yatindra Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో

Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీMadhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ (BJP) ఎంపీ గణేష్ సింగ్ (MP Ganesh Singh) అందరూ