hyderabadupdates.com movies మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. “ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి. మీ క‌ష్టార్జితాన్ని వ‌దులుకోకండి“ అని ఆయ‌న `లింక్డ్ ఇన్‌`లో పోస్టు చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో స్పీడుగా ఉండే ప్ర‌ధాన‌మంత్రి.. తాజాగా దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి.. ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

దేశంలోని బ్యాంకులు, స్టాక్‌మార్కెట్లు, ఇన్సూరెన్సు కంపెనీలు, డివిడెండ్లు, మ్యూచ్‌వ‌ల్ ఫండ్స్ వంటి వాటిలో సుమారు.. ల‌క్ష కోట్ల రూపాయ‌లకు పైగానే సొమ్ము కొన్ని సంవ‌త్స‌రాలుగా మూలుగుతోంది. వీటికి గ‌డువు కూడా తీరిపోయింది. అయినా.. ఎవ‌రూ ఈ సొమ్ము మాది అంటూ.. వ‌చ్చి తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఆర్బీఐ కూడా.. అన్ క్లెయిమ్‌డ్ డిపాజిట్ల‌పై ప్ర‌క‌ట‌న‌లు చేసింది.

అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి.. ప్ర‌క‌ట‌న చేశారు. “మీ సొమ్ము.. మీ హ‌క్కు“ పేరుతో ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లో.. అన్ క్లెయిమ్‌డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సు, డివిడెండ్ల‌ను సంబంధిత వ్య‌క్తులు వ‌చ్చి తీసుకోవాల‌ని కోరారు. అంతేకాదు.. దీనికి ఎవ‌రూ జంకాల్సిన అవ‌స‌రం లేద‌ని.. దీనిపై ఎలాంటి అద‌న‌పు భారం కూడా ప‌డ‌బోద‌ని పేర్కొన్నారు.

దేనిలో ఎంతెంత‌?

+ దేశ‌వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో 78 వేల కోట్ల రూపాయ‌లు ఉన్నాయి.,

+ ఎల్ ఐసీ స‌హా వివిధ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో 14 వేల కోట్లు మూలుగుతున్నాయి.

+ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లో 3 వేల కోట్లు ఉన్నాయి.

+ ప్ర‌భుత్వ, ప్రైవేటు డివిడెండ్లు 9 వేల కోట్లు క్లెయిమ్‌ చేయకుండా ఉన్నాయి.

ఎందుకిలా?

ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా చ‌నిపోయిన కుటుంబాలు.. ప్ర‌మాదాల్లో చిక్కుకుని మృతి చెందిన‌వారు.. అదేవిధంగా రోడ్డు, విమాన ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన వారికి సంబంధించిన ఖాతాలుగా ఆర్బీఐ చెబుతోంది. ఆయా కుటుంబాల్లోని వారు సంబంధిత ఆధారాల‌ను చూపించి.. వాటిని తీసుకువెళ్లాల‌ని సూచిస్తోంది. దీనికి నిర్దేశిత గ‌డువు అంటూ ఏమీ లేదు. మ‌రో ఏడాదిలోపు వీటిని తీసుకోవ‌చ్చు. అనంత‌రం.. ఎవ‌రూ క్లెయిమ్ చేయ‌ని ధ‌నాన్ని.. ప్ర‌భుత్వ ఖాతాలో జ‌మ చేస్తారు.

Related Post

Nidhhi Agerwal Credits Prabhas for India’s Big-Budget Film EraNidhhi Agerwal Credits Prabhas for India’s Big-Budget Film Era

Actor Nidhhi Agerwal has spoken with heartfelt admiration about Prabhas, crediting him for transforming the scale and ambition of Indian cinema. In a recent interaction, Nidhhi said she strongly believes

కూట‌మిలో క‌లివిడి.. గ్రౌండ్ రియాల్టీ ఇదే.. !కూట‌మిలో క‌లివిడి.. గ్రౌండ్ రియాల్టీ ఇదే.. !

నిన్న మొన్నటి వరకు కూటమి పార్టీల మధ్య ఐక్యత ఎలా ఉన్నప్పటికీ ఇటీవల గత వారం నుంచి పార్టీల‌లో నాయ‌కుల మ‌ధ్య కలివిడి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఎంపీలకు సంబంధించి చేసిన కీలక సూచనల అనంతరం ఈ