hyderabadupdates.com movies ముక్కోణపు ప్రేమలో ‘తెలియని’ మలుపులు

ముక్కోణపు ప్రేమలో ‘తెలియని’ మలుపులు

టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ వారమే తెలుసు కదాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది జాక్ తో కొంచెం యాక్షన్ రూటు పడదామని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో తిరిగి తన స్కూలుకు వచ్చేశాడు. ప్రముఖ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ లవ్ కం రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. దీపావళి పండగ సందర్భంగా మరో మూడు యూత్ మూవీస్ తో తలపడుతున్న తెలుసు కదా ఇవాళ ట్రైలర్ రూపంలో తన అసలు కంటెంట్ బయట పెట్టింది.

వరుణ్ (సిద్దు జొన్నలగడ్డ) యువతరం ప్రతినిధి. కాకపోతే మహా దూకుడు. అమ్మాయిల చేతికి మన జుట్టు వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదనుకునే రకం. డాక్టర్ రాగ (శ్రీనిధి శెట్టి) ని చూసి మనసు పారేసుకుని ప్రేమిస్తాడు. ఇంకోవైపు అంజలి (రాశి ఖన్నా) తో ప్రేమాయణం నడిపిస్తాడు. ఒక సందర్భంలో ఇద్దరినీ ఒకే చోటికి చేర్చే విచిత్రమైన పరిస్థితులు కొని తెచ్చుకుంటాడు. అందరూ కలిసి ఉన్నట్టే ఉంటుంది. ముగ్గురూ లవ్ చేసుకుంటారు. కానీ బయటికి చెప్పని ట్విస్టు ఏదో ఈ ట్రయాంగిల్ బంధానికి కారణం అయ్యుంటుంది. అదేంటో తెలియాలంటే అక్టోబర్ 17 దాకా వెయిట్ చేయాల్సిందే.

మాములుగా బాలీవుడ్ లో చూసే మాడరన్ ఏజ్ రిలేషన్ షిప్ ని దర్శకురాలు నీరజ కోన టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరోల కథలు శోభన్ బాబు కాలం నుంచే ఉన్నాయి కానీ తెలుసు కదాలో చాలా డిఫరెంట్ కోణాలు టచ్ చేసిన వైనం స్పష్టం. సిద్దు ఎప్పటిలాగే తన ఎనర్జీతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా వైవా హర్షను క్లాసు పీకుతూ చెప్పే డైలాగులు యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ట్రైలర్ చివరి షాట్ లో పెట్టిన బూతు డైలాగ్ కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే నిన్నటి దాకా అండర్ కరెంట్ గా ఉన్న తెలుసు కదా ఒక్కసారిగా వోల్టేజ్ పెంచేసుకుంది. 

Related Post

సికిందర్ దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలిసికిందర్ దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య, తన కెరీర్ పతాక స్థాయిలో ఉండగా చేసిన సినిమా.. అంజాన్ (తెలుగులో సికిందర్). రన్, సెండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా) లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన లింగుస్వామితో సూర్య జట్టు కట్టడంతో ‘అంజాన్’

అమిత్‌షాతో 20 నిమిషాలు బాబు ఏకాంత భేటీ.. విష‌యం ఏంటి ..!అమిత్‌షాతో 20 నిమిషాలు బాబు ఏకాంత భేటీ.. విష‌యం ఏంటి ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. కేంద్ర హోం శాఖ మంత్రితో 20 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారా? రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న చ‌ర్చించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ ఎంపీలు. అయితే.. లోప‌ల ఏం జ‌రిగిందో త‌మ‌కు తెలియ‌ద‌ని

అల్లు అర్జున్ తో కంటెంట్ ఉన్న నటుడు?అల్లు అర్జున్ తో కంటెంట్ ఉన్న నటుడు?

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ AA22పై బజ్ మాములుగా లేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో స్పీడ్ పెంచుతున్నారు. ప్రస్తుతం ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న