hyderabadupdates.com movies ‘మురారి’ కోసం రక్తం చిందించిన కెమెరామాన్

‘మురారి’ కోసం రక్తం చిందించిన కెమెరామాన్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రాల్లో ‘మురారి’ ఒకటి. అది పోకిరి, శ్రీమంతుడు, ఒక్కడు స్థాయి బ్లాక్‌బస్టర్ కాదు. అప్పటి బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే సూపర్ హిట్ మాత్రమే. కానీ నటుడిగా మహేష్‌ను ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కించిన చిత్రమది.

మహేష్ పలు చిత్రాలు రీ రిలీజ్ కాగా.. ‘మురారి’కి వచ్చినంత స్పందన వేరే చిత్రాలకు రాలేదు. రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత చూసినా కొత్తగా, వావ్ అనిపించేలా ఉండడం.. ఈ తరం ప్రేక్షకులను కూడా మెప్పించడం ఆ సినిమా ప్రత్యేకత.ఈ సినిమా సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉంటుంది.

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అనిపిస్తాయి. అందులోని కొన్ని షాట్స్, కెమెరా యాంగిల్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటికి సినిమాటోగ్రాఫర్‌గా పెద్దగా అనుభవం లేని రామ్ ప్రసాద్‌ నుంచి గొప్ప పనితనాన్ని రాబట్టుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ.

‘మురారి’లో పై నుంచి కొబ్బరి గెల కింద పడే ఒక షాట్‌ను గమనిస్తే.. అది ఎలా తీశారో అని ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పట్లా అప్పుడు ప్రతిదానికీ వీఎఫెక్స్‌ను ఆశ్రయించేవారు కాదు. అంతా ఒరిజినలే. ఆ షాట్ తీయడం వెనుక ఎంత కష్టపడింది ఒక ఇంటర్వ్యూలో రామ్ ప్రసాద్ వెల్లడించాడు.

‘‘కొబ్బరిబొండాలు పడే షాట్ కోసం నన్ను ఏకంగా కొబ్బరిచెట్టే ఎక్కించేశారు. క్రేన్ ద్వారా నన్ను తీసుకెళ్లి కొబ్బరి చెట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ నేను ఒక్కడినే కెమెరా పట్టుకుని కూర్చోవాలి. అప్పుడు మేం వాడిన కెమెరా చిన్నదే కానీ, లెన్స్ చాలా పెద్దది. ఒక చేత్తో కెమెరా ఆపరేట్ చేస్తూ.. ఇంకో చేత్తో కొబ్బరిగెల పట్టుకోవాలి.

కూర్చున్న మహేష్ లేచి వెళ్లేటపుడు నేను ఒక చేత్తో కెమెరా ఆన్ చేసి షూట్ చేస్తూ, ఇంకో చేత్తో కొబ్బరి గెలను వదిలి పెట్టాలి. దర్శకుడు సరిగ్గా టైమింగ్ చూసి యాక్షన్ చెప్పాలి. ఏమాత్రం టైమింగ్ తేడా కొట్టినా కొబ్బరి కాయలు వెళ్లి మహేష్ తల మీద పడతాయి. దీంతో నేను చాలా టెన్షన్ పడ్డాను.

ఏమవుతుందో ఏమో అని భయపడుతూ ఈ షాట్ ఎలా అయినా ఓకే అయిపోవాలి అని దేవుడిని వేడుకున్నాను. ఐతే కొబ్బరిచెట్టు మీద అంతసేపు ఇరుకుగా కూర్చుని ఉండడంతో నా మోచేతి గీసుకుపోయింది. చేతి మీద అంతా తడిగా ఉండడంతో ఏమైందా అని తడిమి చూస్తే రక్తం కారి షర్ట్ తడిచిపోయింది. అయినా అలాగే కంటిన్యూ చేసి షాట్ పూర్తి చేశాం. ఒక్క టేక్‌లో అది ఓకే అయిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం’’ అంటూ ఆ షాట్ వెనుక కష్టాన్ని వివరించాడు రామ్ ప్రసాద్.

Related Post

Varanasi Glimpse review : A Leap Into Global Cinema !Varanasi Glimpse review : A Leap Into Global Cinema !

The Vaaranasi glimpse is nothing short of world-class cinematic madness. For months, fans speculated about the film’s genre—whether Rajamouli was crafting an African adventure or a Bond-style Hollywood spectacle. But