hyderabadupdates.com movies మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి పార్టీలు కలిసి కట్టుగా వైసీపీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించాయి. దీనిపై సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో పార్టీలు మంతనాలు చేశాయి. ప్రధానంగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.

ప్రభుత్వం చేయాల్సిన, చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయినా వాటిని సైతం పక్కన పెట్టి ప్రభుత్వం ఈ లడ్డూ లడాయినే భుజాన వేసుకుంది. వాస్తవానికి రెండు రోజుల కిందట కేబినెట్ సమావేశం నిర్వహించారు. దీనిలో చర్చించేందుకు 22 ప్రధాన అంశాల అజెండాను నిర్ణయించుకున్నారు. అయితే వాటిని కూడా పక్కన పెట్టేసి పూర్తిగా కేబినెట్లో శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే చర్చించుకున్నారు. ఈ పరిణామం గతంలో ఎప్పుడూ జరగలేదు.

పైగా ఎంతో ఇంపార్టెంట్ అనుకున్న అమరావతి, పోలవరం పనులపై చర్చించాలని ముందుగా నిర్ణయించుకున్న ప్రభుత్వం వాటిని కూడా పక్కన పెట్టేసింది. వైసీపీ నాయకులు లేవనెత్తుతున్న లడ్డూ అంశానికి సీబీఐ ఇచ్చిన నివేదిక, కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్‌కే పరిమితం అయింది. ఈ పరిణామాలను గమనిస్తే వైసీపీ కోరుకున్నదే జరిగిందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పాలనను ప్రతిష్ఠంభన చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న వ్యూహం వైసీపీలో ఎప్పటి నుంచో ఉంది.

ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెబుతున్నారు. పాలనను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా పార్టీల నాయకులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ అనూహ్యంగా అధిష్టానాల పెద్దలే వైసీపీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. లేకపోతే మూడు రోజులుగా కేవలం లడ్డూ చుట్టూ ప్రభుత్వం చక్కర్లు కొట్టడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఇదే పనిగా పవన్, చంద్రబాబు భేటీ కావడం, మరోవైపు మూడు పార్టీల నేతలు భేటీ కావడం వంటివి పాలనపై ప్రభావం చూపుతున్నాయన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

Related Post

9 South films to see in theaters this week: Prithviraj Sukumaran’s Vilaayath Budha to Kavin, Andrea Jeremiah’s Mask9 South films to see in theaters this week: Prithviraj Sukumaran’s Vilaayath Budha to Kavin, Andrea Jeremiah’s Mask

Cast: Kavin, Andrea Jeremiah, Ruhani Sharma, Charle, Bala Saravanan, Archana Chandhoke, George Maryan, Aadukalam Naren, Subramaniam Siva Director: Vikarnan Ashok Language: Tamil Runtime: TBA Genre: Dark Comedy Action Thriller Release