hyderabadupdates.com movies మూడోసారి దొరికిపోయిన మర్దాని

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయడం వల్లే ధూమ్, పుష్ప, కెజిఎఫ్, బాహుబలి, కాంతార లాంటివి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కొన్ని ఊసులో లేకుండా పోయాయి.

బాలీవుడ్ ఈ కంటిన్యుయేషన్ హ్యాంగోవర్ ఎప్పటి నుంచో ఉంది. 2014లో రాణి ముఖర్జీ టైటిల్ పాత్రలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన మర్దాని వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై ఘనవిజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో రూపొంది అప్పట్లోనే అరవై కోట్లకు పైగా వసూలు చేయడం ఒక రికార్డు.

అయిదు సంవత్సరాల తర్వాత 2019లో మర్దాని 2 వచ్చింది. సైకో కిల్లర్ నేపథ్యంతో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా కూడా బాగానే అలరించింది. కేవలం ఒక గంట నలభై అయిదు నిమిషాల నిడివితో ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇది కూడా సుమారు 68 కోట్ల దాకా వసూళ్లు తెచ్చి హైప్ నిలబెట్టుకుంది.

తాజాగా మర్దాని 3 రిలీజయ్యింది. ఏడేళ్ల గ్యాప్ కావడంతో ఈసారి బజ్ కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. కానీ మేజిక్ రిపీట్ కాలేదు. మూడోసారి మర్దాని దొరికిపోయింది. లైఫ్ టైం థియేటర్ వసూళ్లు 35 కోట్లకు దాటాకపోవచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇంత తక్కువ స్పందనకు కారణాలు లేకపోలేదు.

మర్దాని 3 స్టోరీ చాలా రొటీన్ గా రాసుకున్నారు. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి మాఫియా నడిపించే అమ్మ అనే లేడీ డాన్ ఆటకట్టించడమే ఇందులో మెయిన్ పాయింట్. సన్నివేశాలు చాలా ఫ్లాట్ గా, ట్విస్టులు చప్పగా సాగుతూ ఒక మాములు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి.

మొదటి రెండు భాగాలకు బలంగా నిలిచిన బిగుతైన స్క్రీన్ ప్లే ఈసారి బలహీనంగా మారిపోయింది. రెండు గంటల లెన్త్ కూడా భారంగా అనిపిస్తుంది. రాణి ముఖర్జీ తన వంతుగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆవిడ ఒక్కటే వీక్ కంటెంట్ ని కాపాడలేకపోయింది. మర్దాని ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు డైరెక్ట్ చేయడం మరో ప్రధానమైన మైనస్.

Related Post

Dhandoraa director urges audiences to ignore controversy and judge the film on meritDhandoraa director urges audiences to ignore controversy and judge the film on merit

Director Muralikanth Devasoth has urged audiences not to judge Dhandoraa based on the controversy surrounding actor Sivaji, and instead watch the film for its content and message. Speaking about the

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌ క‌రూర్‌లో నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. నాటి ఘ‌ట‌న‌లో 41 మంది మృతి చెందారు. ఈ

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందినాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వహాబ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్టవుతున్నారు. ఇప్పటిదాకా మదర్ క్యారెక్టర్స్ లో రిపీట్ ఆర్టిస్టులను చూసి