hyderabadupdates.com movies మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమా ఫీవర్‌ మొదలైంది. ఫస్ట్‌డే–ఫస్ట్‌షో టికెట్ల కోసం మెగా అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అమలాపురంలో జరిగే ప్రీమియర్‌ షో టికెట్‌ వేలంలో అభిమాని వెంకట సుబ్బారావు రూ.1.11 లక్షలకు టికెట్‌ను దక్కించుకోవడం సంచలనంగా మారింది.

నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లో మరో టికెట్‌ రూ.లక్షా రెండు వేల వరకు పలికింది. అమలాపురంలో తొలి టికెట్‌ను బీజేపీ నాయకుడు వేలంలో సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేలం ద్వారా సమకూరిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కు విరాళంగా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. హీరోలపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ చిత్రం జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, టికెట్ల వేలాలు ఇప్పటికే మెగా ఫీవర్‌కు నిదర్శనంగా మారుతున్నాయి.

Related Post

అభిమానులు కోరుకున్నది ఇదే స్వామీఅభిమానులు కోరుకున్నది ఇదే స్వామీ

మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి పందెంలో విన్నర్ కాకపోయినా భర్త మహాశయులకు విజ్ఞప్తితో గత సినిమాల కంటే కొంచెం బెటరనిపించడం అభిమానులకు ఊరట కలిగించింది. కానీ ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే కథ చేయాలనుందని కోరి మరీ రాయించుకోవడం తప్ప దర్శకుడు

నితిన్… ఇదీ వదిలేశాడా?నితిన్… ఇదీ వదిలేశాడా?

ఒకప్పుడు వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితుల్లో ‘ఇష్క్’ మూవీతో ఊపిరి పీల్చుకున్నాడు నితిన్.  ఆ తర్వాత అతను జాగ్రత్తగానే అడుగులు వేశాడు. గుండె జారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి విజయాలతో తన కెరీర్ బాగానే