కాకతాళీయమే అయినా కొన్ని టాలీవుడ్ క్లాషులు ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటిదే ఇది. సితార ఎంటర్ టైన్మెంట్స్ లో ఒకేసారి ఆరేడు సినిమాలు నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. వీటికి రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం నిర్మాత నాగవంశీకి పెద్ద సవాల్ గా నిలిచింది. 2026 సంక్రాంతి పండగని టార్గెట్ చేసుకుని నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 14 అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. సరిగ్గా దీనికి రెండు రోజుల ముందు లేదా అదే రోజు చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లకు వస్తోంది. రెండూ ఎంటర్ టైన్మెంట్ మూవీస్ కావడంతో పోరు ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.
తాజాగా సితార బ్యానర్ విశ్వక్ సేన్ ఫంకీ డేట్ అనౌన్స్ చేసింది. ముందు చెప్పిన ఫిబ్రవరి కాకుండా ఏప్రిల్ 3 వస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది. సరిగ్గా దీనికి కేవలం వారం ముందు మార్చి 27 రామ్ చరణ్ పెద్ది ఉంటుంది. దానికున్న హైప్ చూస్తుంటే కనీసం రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ ని డామినేట్ చేసేలా ఉంది. అయినా కూడా ఫంకీని కాంపిటీషన్ లో పెట్టడం ఆశ్చర్యమే. ఒకదానికి మెగా ఫాదర్ పోటీలో ఉంటే మరొక దానికి మెగా పవర్ స్టార్ కవ్విస్తున్నాడు. ఇది అనుకోకుండా జరిగిందే అయినా సితార ఇలా మెగా పోటీకి సై అనడం ఆసక్తికర పరిణామం. అయితే ఫంకీకి నాని ప్యారడైజ్ ముప్పు కూడా ఉంది.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ అప్పట్లో సంక్రాంతికి రావాలనుకున్నప్పుడు భీమ్లా నాయక్ ని రిలీజ్ చేసేందుకు నాగవంశీ రెడీ అయ్యారు. బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ ఏంటని మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోయినా నాగవంశీ పట్టుదలగా ఉన్నారు. తర్వాత ఈ రెండు సినిమాలు ఆ సీజన్ ని వదిలేసి ఒకటి ఫిబ్రవరిలో మరొకటి మార్చిలో రావడం వేరే సంగతి. ఇప్పుడు పైన చెప్పుకున్న మూవీస్ అన్నీ ఖచ్చితంగా మాట మీద ఉండి క్లాష్ కు సిద్ధపడతాయా లేదానేది ఇప్పుడే చెప్పలేం ఎందుకంటే మాస్ జాతర, కింగ్డమ్ లాంటివి కూడా సితార నుంచే వచ్చి పలు వాయిదాలు డేట్లు మార్చుకుంటూ జనాల ముందుకు వచ్చాయి.