hyderabadupdates.com movies మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్

మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్

విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. భారత ఏఐ రంగంలో ఇది ఒక చరిత్రాత్మక మలుపు అని, ఏఐ రంగానికి ప్రపంచ కేంద్రంగా భారత్ మారబోతోందని ఏఐ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వెలుపల ఏఐ రంగంలో గూగుల్ పెట్టిన అతి భారీ పెట్టుబడి, అతి పెద్ద డేటా సెంటర్ ఇదే కాబోతోందని ఐటీ రంగం కోడై కూస్తోంది. అంతేకాదు, గూగుల్ తర్వాత మరెన్నో ప్రముఖ ఏఐ కంపెనీలు భారత్ వైపు రావడం ఖాయమని ఏపీ ప్రభుత్వం కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ క్రమంలోనే ఆ డేటా సెంటర్ క్రెడిట్ కొట్టేయాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూగుల్ డేటా సెంటర్ పై మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలోనే ఆ డేటా సెంటర్ కు బీజం పడిందని, అదానీకి కూటమి ప్రభుత్వం కనీసం థ్యాంక్స్ చెప్పలేదని అన్నారు. అయితే, తాజాగా జగన్ మరో అడుగు ముందుకు వేసి అసలు గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని వితండ వాదన చేస్తున్నారు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని చెప్పారు.

అంతేకాదు, గూగుల్ ను ఏపీకి తెచ్చేందుకు చంద్రబాబు చేసింది ఏముందని జగన్ అంటున్నారు. సింగపూర్ నుంచి కేబుల్స్ తెచ్చింది వైసీపీ అని, అదానీ–గూగుల్ మధ్య 2022లోనే నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని చెబుతున్నారు. తమ హయాంలోనే ఇక్కడ భూములిచ్చామని, ఆ రోజు పడ్డ అడుగులు ఇప్పుడు గూగుల్ కు బాటలు వేశాయని అంటున్నారు. ఇలా మెల్లమెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే, జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడిన సంగతి ఆయన మరిచిపోయినట్లు కనిపిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్లే గూగుల్ తో పాటు ఇతర కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీనే ఆయనకు ఆటోమేటిక్ గా క్రెడిట్ తెచ్చిపెడుతుందని అంటున్నారు.

Related Post

ప్రకాశ్ రాజ్: “సారీ… ఇకపై ఇలాంటివి చేయను”ప్రకాశ్ రాజ్: “సారీ… ఇకపై ఇలాంటివి చేయను”

బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు సీఐడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, “మొదట అది గేమింగ్ యాప్ అనుకుని

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది. ఫ్యాట్ పిగ్స్, డాగ్స్, స్లోగ్స్ అంటూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన ట్రాక్ రికార్డ్ ట్రంప్ సొంతం. ఇక, ట్రంప్