hyderabadupdates.com Gallery రంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదా

రంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదా

రంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదా post thumbnail image

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈద్-ఉల్-ఫితర్ సెలవు కారణంగా ప‌ద‌వ త‌ర‌గ‌తికి సంబంధించి జ‌ర‌గాల్సిన‌ ఆంగ్ల పరీక్షను వాయిదా వేసిన‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఈ ప‌రీక్ష వాస్తవానికి మార్చి 21న జరగాల్సి ఉంది. ఆంగ్ల పేపర్ (పేపర్ కోడ్‌లు 13E , 14E) ను తిరిగి ఇప్పుడు 2 న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం నుండి వెలువడిన అధికారిక ప్రకటన ప్రకారం 21న కాకుండా గురువారం నాడు నిర్వహించ బడుతుంది. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతుంది .
సవరించిన ఈ పరీక్షల షెడ్యూల్ గురించి తమతమ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి . ఈ మార్పు గురించి ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ముఖ్య పర్యవేక్షకులు , శాఖాపరమైన అధికారులు, ఇన్విజిలేటర్లు , పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ తెలియజే యాలని సూచనలు జారీ చేశారు. వాయిదా పడిన ఈ పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను కోరారు.
పరీక్షా కేంద్రాల సంసిద్ధత, సిబ్బందిని నియమించడం , అవసరమైన అన్ని లాజిస్టికల్ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయడం వంటి అంశాలు ఈ ఏర్పాట్లలో భాగంగా ఉంటాయి. మార్చి 21న విధులు నిర్వర్తించడానికి నియమితులైన ఇన్విజిలేటర్లు, వాయిదా పడిన తేదీ అయిన ఏప్రిల్ 2న కూడా తమ బాధ్యతలను యథావిధిగా కొనసాగిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి శాఖాపరంగా ప్రత్యేక సవరణ ఉత్తర్వులు జారీ చేయబడతాయి.
The post రంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Atchannaidu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడుKinjarapu Atchannaidu: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు

    ఏపీలో రైతులకు వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న “అన్నదాత సుఖీభవ” పథకం రెండో విడ‌త నిధులు జ‌మ చేయ‌నున్నట్లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం పీఎం కిసాన్ నిధులు అదేరోజు

చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఎవ‌రైనా స‌రే చైనాకు చెందిన మాంజాల‌ను వాడితే, లేదా ఉప‌యోగించినా కఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. #SayNoToChineseManja

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు.