hyderabadupdates.com movies రజనీకాంత్ షాకింగ్ నిర్ణయాలు నిజమేనా ?

రజనీకాంత్ షాకింగ్ నిర్ణయాలు నిజమేనా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోబోతున్నట్టు వచ్చిన వార్త చెన్నై మీడియాని కుదిపేస్తోంది. ఆయనేమీ అధికారికంగా ప్రకటించకపోయినా ఇన్ సైడ్ లీక్స్ నుంచి వచ్చిన సమాచారం పక్కాగా ఉండటంతో క్షణాల్లో ఇది వైరల్ గా మారిపోయింది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో సుందర్ సి దర్శకత్వంలో ఒకటి నవంబర్ ఏడున ప్రకటిస్తారట. మరొకటి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్ నటించబోయే మల్టీస్టారర్. జైలర్ 2 రిలీజయ్యాక నెల్సన్ ఈ పని మీదే ఉంటాడట. మరి జూనియర్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్న మూవీ ఇంకొంచెం లేట్ అవుతుందేమో.

ఒకవేళ ఇది నిజమైతే రజనీకాంత్ విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ఆయనకు మంచిదే. ఇప్పటికే ఏడు పదుల వయసులోనూ అభిమానుల కోసం చాలా కష్టపడుతున్నారు. రోబో షూటింగ్ టైంలో తీవ్ర అనారోగ్యానికి గురై పలుమార్లు చికిత్స తీసుకోవాల్సి వచ్చినా తట్టుకుని మరీ యాక్టింగ్ కొనసాగిస్తున్నారు. జైలర్ బ్లాక్ బస్టర్ ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కూలి అంచనాలు అందుకోలేకపోయినా అయిదు వందల కోట్ల గ్రాస్ దాటడం మాములు విషయం కాదు. రజని స్టామినా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని ఇలాంటి ఫలితాలు ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటాయి.

రజని ఏజ్ దృష్ట్యా ఇప్పుడు ఫైనల్ గా కమిట్ అవుతున్న సినిమాలు రెండూ పూర్తి చేయడానికి 2027 దాకా టైం పట్టొచ్చు. అయితే బి గ్రేడ్ హారర్ సినిమాలు తీస్తున్న సుందర్ సికి అవకాశం ఎందుకిచ్చారనేది చాలా మంది మూవీ లవర్స్ మెదడుని తొలిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సుందర్ సి కెరీర్ మొత్తంలో గర్వంగా చెప్పుకునే సూపర్ హిట్ మూవీ అరుణాచలం. ఆ తర్వాత రజనితో మరోసారి పని చేయలేదు కానీ తలైవర్ తో అనుబంధం అలాగే కొనసాగిస్తున్నారు. ఆ చనువుతోనే సుందర్ సికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు. సో కోలీవుడ్ సూపర్ స్టార్ ని తెరమీద ఇంకో రెండుసార్లే చూస్తామన్న మాట.

Related Post

కూట‌మి గ్రాఫ్ చంద్ర‌బాబు డెసిష‌న్ చూశారా…!కూట‌మి గ్రాఫ్ చంద్ర‌బాబు డెసిష‌న్ చూశారా…!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల నాటికి మరోసారి గెలుపు గుర్రం ఎక్కడానికి మార్చుకోవాల్సిన విధానాలు వంటి కీలక అంశాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. తాజాగా అధికారులు,

క‌ర్నూలు క‌ష్టాలు తీరుతాయి: మోడీక‌ర్నూలు క‌ష్టాలు తీరుతాయి: మోడీ

క‌ర్నూలులో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. అవి త్వ‌ర‌లోనే తీరుతాయ‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ‘డ్రోన్స్ హ‌బ్‌’ ద్వారా.. ఇక్క‌డి వారికి భారీ ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధిలో క‌ర్నూలు, రాయ‌లసీమల