hyderabadupdates.com movies రజినీ 37 ఏళ్ల సినిమా రిలీజ్

రజినీ 37 ఏళ్ల సినిమా రిలీజ్

స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్. కొన్నేళ్ల నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో, తమిళంలో టాప్ స్టార్ల సినిమాలను రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ మధ్య ఎంతో శ్రద్ధ తీసుకుని ‘పడయప్పా’ (తెలుగులో నరసింహా) చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అది సంచలన వసూళ్లు సాధించింది. 

ఇప్పుడు రజినీ మరో పాత సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలా అని అది రీ రిలీజ్ అనుకుంటే పొరపాటే. 37 ఏళ్ల ముందు రిలీజ్ కావాల్సిన సినిమాను కాస్తా.. ఇప్పుడే విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా పేరు.. హమ్ మే షెహెన్ షా కౌన్. ఈ హిందీ చిత్రాన్ని షూటింగ్ మొదలుపెట్టిన 37 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ చేయబోతుండడం విశేషం.

రజినీతో పాటు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, లెజెండరీ నటుడు శత్రుఘ్న సిన్హా ముఖ్య పాత్రలు పోషించిన ‘హమ్ మే షెహెన్ షా కౌన్’ను 1988లో రిలీజ్ చేయాలనుకున్నారు. హర్మేష్ మల్హోత్రా రూపొందించిన ఈ చిత్రం రకరకాల కారణాలతో అప్పుడు విడుదలకు నోచుకోలేదు. ల్యాబ్‌లోనే ఉండిపోయిన ఈ సినిమా ప్రింట్లను ఇప్పుడు రీ మాస్టర్ చేస్తున్నారు. 

ఈ సినిమా మీద తాము ఎప్పుడూ ఆశ కోల్పోలేదని.. ‘హమ్ మే షెహెన్ షా కౌన్’ ఎన్నో ఎదురు దెబ్బలను, నిశ్శబ్దంతో కూడిని బాధను భరించిందని.. ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకులను ఈ సినిమా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజా రాయ్ తెలిపాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మరి ఇన్నేళ్ల తర్వాత విడుదలకు నోచుకుంటున్న తన చిత్రాన్ని రజినీకాంత్ ప్రమోట్ చేస్తాడేమో చూడాలి. ఈ చిత్రంలో దివంగత అమ్రిష్ పురి కూడా ఒక కీలక పాత్ర చేయడం విశేషం.

Related Post

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనారవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి ఫ్యామిలీ జానర్ లోకి వచ్చేశాడు. దాని ఫలితమే భర్త మహాశయులకు విజ్ఞప్తి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందాలైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా ఏదో అద్భుతం చేస్తుందనుకుంటే పూర్తి రివర్స్ లో సూపర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఇలాంటి కంటెంట్ ఎంచుకున్నందుకు స్వయంగా అభిమానులే

Kalyani Priyadarshan to collaborate with this Tamil star hero & director again?Kalyani Priyadarshan to collaborate with this Tamil star hero & director again?

Malayalam actress Kalyani Priyadarshan is fresh off the success of Lokah: Chapter 1 which is set to arrive on OTT this weekend. The actress’s glamorous song from her new Tamil