hyderabadupdates.com movies రవితేజ అభిమానులకు కాస్త రిలీఫ్

రవితేజ అభిమానులకు కాస్త రిలీఫ్

గత మూడేళ్లుగా ఒకే మూస కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన మాస్ మహారాజా రవితేజకు భర్త మహాశయులకు విజ్ఞప్తి రూపంలో ఎట్టకేలకు కొంత రిలీఫ్ అయితే దక్కింది. టాక్, కంటెంట్, రివ్యూస్ పరంగా మిగిలిన పోటీ చిత్రాలతో పోలిస్తే ఇది కొంచెం వెనుకబడి ఉన్నప్పటికీ కమర్షియల్ కోణంలో బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఉండటం సంతోషించాల్సిన విషయం.

దర్శకుడు కిషోర్ తిరుమల ఎలాంటి ప్రయోగాలు చేయకుండా భార్య, ప్రియురాలు మధ్య నలిగిపోయే ఒక హీరోని సృష్టించి దాని చుట్టూ ట్రెండీ కామెడీని సెట్ చేసుకోవడంతో ఓ వర్గం మాస్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. సునీల్, సత్య హాస్యం వీలైనంత లాగింది.

మాస్ జాతర, రావణాసుర, ఖిలాడీ లాంటి డిజాస్టర్లతో పోలిస్తే భర్త మహాశయులకు చాలా బెటరే కానీ రవితేజ పొటెన్షియల్ ఇంకా పూర్తిగా బయట పెట్టే దర్శకుడు పడాలి. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ లో చాలా కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తామని యూనిట్ నుంచి వినిపిస్తున్న లీక్.

హీరోయిన్ వెంట పడి డ్యూయెట్లు పాడటాలు, ఓవర్ టాప్ కామెడీ లేకుండా సీరియస్ జానర్ లో ఉంటుందట. కాకపోతే మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా బాలన్స్ ట్రీట్ మెంట్ రాసుకున్నారని వినికిడి. ఇరుముడి టైటిల్ ని పరిశీలిస్తున్నారు. దాదాపు కన్ఫర్మ్ కావొచ్చు. ఇది కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.

చిరంజీవికి మన శంకరవరప్రసాద్ గారు ఏ స్థాయిలో కంబ్యాక్ అయ్యిందో అలాంటి కంటెంట్ రవితేజకు పడాలనేది ఫ్యాన్స్ కోరిక. అనిల్ రావిపూడిని రాజా ది గ్రేట్ సీక్వెల్ అడుగుతున్నారు కానీ ప్రస్తుతం తనకున్న కమిట్ మెంట్ల దృష్ట్యా అదంత ఈజీ అయితే కాదు.

పైగా రవితేజ ఇప్పుడు అంధుడి పాత్రను మళ్ళీ వేయడం కన్నా రావిపూడి ఏదైనా కొత్త సబ్జెక్టు తయారు చేస్తే బెటర్. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫైనల్ స్టేటస్ తెలియడానికి ఎంతలేదన్నా ఇంకో పది రోజులు పడుతుంది. బుక్ మై షో ట్రెండింగ్ లోనూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మాస్ రాజా ఒకప్పటి విక్రమార్కుడు, కిక్ లాంటి కంటెంట్ ఎప్పుడు ఇస్తారో.

Related Post

Baramulla Review: A bold idea that picks pace after a slow beginningBaramulla Review: A bold idea that picks pace after a slow beginning

Story Children mysteriously start disappearing from a region called Baramulla, and a police officer is assigned to investigate the case. While chasing leads and trying to understand what’s really happening,

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదవులు దక్కని వారు అసంతృప్తిలోనే కొనసాగుతారు. కానీ, చిత్రం ఏంటంటే పదవులు దక్కిన వారు కూడా అసంతృప్తితోనే