hyderabadupdates.com movies రవితేజ ఆగేది లేదు… తగ్గేది లేదు

రవితేజ ఆగేది లేదు… తగ్గేది లేదు

బాక్సాఫీస్ ఫలితాలతో పట్టింపు లేకుండా తన పని నటించడం వరకేననే ధోరణి రవితేజ ప్రత్యేకత. వేగంగా సినిమాలు చేయడం వల్లే ఫ్లాపులు పడుతున్నాయని అభిమానులు ఫీలవుతున్నప్పటికీ, ఆ స్పీడ్ ని సరిగ్గా వాడుకోకుండా డిజాస్టర్లు ఇస్తున్న దర్శకుల తప్పుని విస్మరించకూడదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతరతో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకున్న రవితేజకు గత కొన్నేళ్లలో దక్కిన సక్సెస్ లు వాల్తేరు వీరయ్య, ధమాకా మాత్రమే. వీటిలో ఒకటి స్పెషల్ క్యామియో కాబట్టి కౌంట్ సింగల్ గానే తీసుకోవాలి. ఇక సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి రావడంలో ఎలాంటి డౌట్ లేదని టీమ్ నొక్కి వక్కాణిస్తోంది.

అదింకా థియేటర్లలో అడుగు పెట్టకుండా రవితేజ మరో సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీని వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారట. హీరోయిన్ గా కోలీవుడ్ ఫేమ్ ప్రియా భవాని శంకర్ పేరు వినిపిస్తోంది. 2026 వేసవికి విడుదలయ్యేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. ఫలితాల సంగతి పక్కన పెడితే రవితేజ దూకుడుని ఇన్స్ పిరేషన్ గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా యూనిట్లు బిజీగా ఉండి ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది పాజిటివ్ యాంగిల్ లో చూడాల్సిన కోణం.

అలాని క్వాలిటీ పట్టించుకోకుండా ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకంటే సక్సెస్ లు కూడా ముఖ్యమే. అయినా సరే రవితేజ మాత్రం తగ్గేది లేదు ఆగేది లేదు పద్దతిని ఫాలో అవుతున్నారు. సితార బ్యానర్ లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ మూవీని పెండింగ్ లో ఉంచినట్టు సమాచారం. ఇప్పుడదే సబ్జెక్టు కార్తీ దగ్గరికి వెళ్లిందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. గతంలో అనుదీప్ సినిమాను సైతం వదులుకున్న రవితేజ కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో మాత్రం ఓవర్ మాస్ ఎలిమెంట్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నారు.

Related Post

వారణాసి ట్విస్టుకి జక్కన్న రియాక్షన్ ఏంటోవారణాసి ట్విస్టుకి జక్కన్న రియాక్షన్ ఏంటో

నవంబర్ 15 రివీల్ కాబోతున్న ఎస్ఎస్ఎంబి టైటిల్ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. లీకైన సోర్స్ నుంచి వినిపిస్తున్న పేరు వారణాసి. కానీ ఇంత పెద్ద గ్లోబల్ మూవీకి అలా పెడతారానే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ టైంలో కూడా

దీపావళికి లీడ్ తీసుకునేదెవరు?దీపావళికి లీడ్ తీసుకునేదెవరు?

కొన్ని నెలలుగా డల్లుగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సెప్టెంబరులో మంచి ఊపే వచ్చింది. అక్టోబరులోనూ ‘కాంతార: చాప్టర్-1’తో మంచి ఆరంభమే దక్కింది. ఈ వారం ‘శశివదనే’ సహా కొన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాతి వారం బాక్సాఫీస్