hyderabadupdates.com movies రష్మికలోని అసలు నటి బయటికొచ్చింది

రష్మికలోని అసలు నటి బయటికొచ్చింది

ది గర్ల్ ఫ్రెండ్ కమర్షియల్ గాపెద్ద సక్సెస్ అవుతుందా లేదానేది పక్కన పెడితే నటన పరంగా రష్మిక మందన్న ఒకేసారి పది మెట్లు ఎక్కేసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతోంది. నిజానికి తనలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ స్టార్ హీరోల సరసన ఎక్కువ సినిమాలు చేయడంతో దర్శకులకు తనను ఎక్స్ ప్లోర్ చేసే ఛాన్స్ దొరకలేదు. పుష్ప 2లో జాతర సీన్ లో భర్తను పొగిడే శ్రీవల్లిని అంత సులభంగా మర్చిపోలేం. రన్బీర్ కపూర్ లాంటి పవర్ హౌస్ ని ఎదురుగా పెట్టుకుని అతన్ని ఛాలెంజ్ చేసేలా యానిమల్ లో స్పేస్ దొరికినప్పుడల్లా ఉనికిని చాటుకుంది. ఒక్క చావాలోనే అంత స్పేస్ దొరకలేదు

ఇటీవలే వచ్చిన తమ్మలో హారర్ కామెడీ బ్యాలన్స్ తప్పడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది కానీ లేదంటే అందులోనూ బాగానే కష్టపడింది. ఇక అసలు విషయానికి వస్తే ది గర్ల్ ఫ్రెండ్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వినిపిస్తోంది. క్రిటికల్ కాన్సెప్ట్ ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హ్యాండిల్ చేయడం గురించి, చాలా క్లిష్టమైన క్యారెక్టరైజేషన్ ని రష్మిక మందన్న పోషించిన తీరు గురించి ప్రశంసలు వర్షంలా కురుస్తున్నాయి. కామన్ ఆడియన్స్ కి ఈ కాన్సెప్ట్ రీచ్ అవుతుందా లేదానేది పక్కన పెడితే రష్మిక మందన్న మాత్రం వంద మార్కులకు వందా తెచ్చుకుని అందరినీ డామినేట్ చేసింది.

క్లైమాక్స్ ఎపిసోడ్, షవర్ సీన్, హాయ్ నాన్న సినిమా చూసే సన్నివేశం, ఇంటర్వల్ బ్లాక్ ఇలా చెప్పుకుంటూ పోతే రష్మిక బెస్ట్ అని చెప్పుకునే మెచ్చుతునకలు గర్ల్ ఫ్రెండ్ లో చాలానే ఉన్నాయి. కథనం నెమ్మదిగా సాగినప్పటికీ తన నటన వల్లే చివరి దాకా కూర్చోబెట్టిందనేది అధిక శాతం నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. పెద్దగా పోటీ లేని టైంలో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ ని యూత్ ఎంత దగ్గరకు తీసుకుంటే అంత హిట్ అవుతుంది. కాకపోతే అబ్బాయిలు రిసీవ్ చేసుకోవడం కీలకం కానుంది. టీమ్ అయితే హ్యాపీగా ఉంది. రిలీజ్ రోజు సాయంత్రమే తమ ఆనందాన్ని పంచుకుంటూ సక్సెస్ మీట్ నిర్వహించింది.

Related Post

డ్యూడ్ హీరో జుత్తుకి ఫ్లాప్ సినిమా స్ఫూర్తిడ్యూడ్ హీరో జుత్తుకి ఫ్లాప్ సినిమా స్ఫూర్తి

పేరుకి తమిళ హీరోనే అయినా ప్రదీప్ రంగనాథన్ మన యూత్ కి క్రమంగా దగ్గరవుతున్నాడు. లవ్ టుడే, డ్రాగన్ రెండూ కమర్షియల్ గా సక్సెస్ సాధించడమే దానికి నిదర్శనం. చూసేందుకు పక్కింటి కుర్రాడిలా అనిపించే ఈ యంగ్ టాలెంట్ ఈ వారం

రాజా సాబ్ ను వాళ్ళు లైట్ తీసుకున్నారా?రాజా సాబ్ ను వాళ్ళు లైట్ తీసుకున్నారా?

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు ప్ర‌భాస్‌ను త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేస్తారు కానీ.. రాజ‌మౌళితో సినిమాలు చేసిన వేరే హీరోల‌కు ఈ స్థాయి ఫాలోయింగ్, మార్కెట్