hyderabadupdates.com movies రష్మిక మందన్న మీదే భారమంతా

రష్మిక మందన్న మీదే భారమంతా

వచ్చే వారం అక్టోబర్ 21 బాలీవుడ్ మూవీ ధామా విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు. కారణం రష్మిక మందన్న. గతంలో ఇదే నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలిమ్స్ తీసిన స్త్రీ 2ని అనువదించలేదు. కానీ శ్రీవల్లి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ధామాని ఇతర భాషల్లో తీసుకొస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో దెయ్యాల సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందించిన ఈ హారర్ డ్రామాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. ట్రైలర్ లో చాలా కంటెంట్ చూపించారు కానీ ఆశించిన హైప్ సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ తక్కువగానే ఉంది.

ఈ నేపథ్యంలో భారమంతా రష్మిక మందన్న మీదే పడుతోంది. కేవలం తన వల్లే ఓపెనింగ్స్ వస్తాయని కాదు కానీ ఆయుష్మాన్ ఇమేజ్ మరీ పెద్ద స్థాయిలో లేకపోవడం వల్ల జానర్ అడ్వాంటేజ్ పనికి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే హిందీ ప్రేక్షకుల్లో ఈ దెయ్యాల సినిమాల మీద క్రమంగా ఇంటరెస్ట్ తగ్గుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే హైప్ అంతగా ఏర్పడలేదని అభిప్రాయపడుతున్నారు. అక్కడేమో కానీ మన దగ్గర స్ట్రెయిట్ సినిమాల హడావిడి చాలా ఉంది. దీపావళికి ఏకంగా నాలుగు రిలీజులు అవి కూడా యూత్ ఫుల్ మూవీస్ కావడంతో వారం పది రోజులు థియేటర్లలో సందడి ఉంటుంది.

సో ధామా ఖచ్చితంగా స్త్రీ 2లాగా ఎక్స్ ట్రాడినరి టాక్ తెచ్చుకోవాల్సిందే. గత మూడేళ్లుగా రష్మిక మందన్నకు ఒక్క సల్మాన్ ఖాన్ సికందర్ తప్ప అన్నీ బ్లాక్ బస్టర్లే పడ్డాయి. పుష్ప 2, యానిమల్, చావా ఒకదాన్ని మించి మరొకటి రికార్డుల బూజు దులిపాయి. కుబేర కూడా హిట్టు క్యాటగిరీలో పడింది. ఇప్పుడు ధామా ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంకో ఇరవై రోజులు తిరగకుండానే రష్మిక మందన్న తెలుగు సినిమా ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7 జనాల ముందుకు వచ్చేస్తుంది. సో ముందైతే ధామాతో సక్సెస్ అందుకుంటే దానికి బిజినెస్ పరంగా మరింత ఉపయోగపడుతుంది. అన్నట్టు ధామాలో మూడు ఐటెం సాంగ్స్ పెట్టడం వెరైటీ.

Related Post