మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లిపోయారు. వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే విడుదల కానుంది. నిన్న హిందీ దృశ్యం 3కి శ్రీకారం చుట్టారు. ఇది ఒరిజినల్ గా జీతూ రాసుకున్న కథతో సంబంధం లేకుండా వేరేది చేస్తున్నారని ముంబై టాక్. లీగల్ గా ఎలాంటి సమస్యలు రాకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్టు ఇన్ సైడ్ రిపోర్ట్. దీన్ని కూడా ఫాస్ట్ గా తీసేసి మలయాళం, హిందీ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. బడ్జెట్ డిమాండ్ చేసేది కాదు కాబట్టి ఈజీగానే టార్గెట్ చేరుకోవచ్చు.
ఇప్పుడు మన రాంబాబు ఎప్పుడు స్టార్ట్ అవుతాడనేది ఫ్యాన్స్ ప్రశ్న. మన శంకరవరప్రసాద్ గారులో క్యామియోని ఫినిష్ చేసుకుని ప్రస్తుతం త్రివిక్రమ్ తీస్తున్న ఆదర్శ కుటుంబం సెట్లో అడుగు పెట్టిన వెంకీ దీన్ని ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారట. అయితే దృశ్యం 3 పట్ల ఆసక్తిగా ఉన్నారో లేదో ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే దృశ్యం 2 తీసింది జీతూ జోసెఫే. ఇప్పడు మూడో ఇంస్టాల్ మెంట్ కు కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే మోహన్ లాల్ పనులు పూర్తి చేయకుండా రాలేడు. మరీ ఎక్కువ లేట్ అయితే ఇక్కడ హైప్ తేవడం కష్టమవుతుంది. ఇవన్నీ లెక్కలేసుకుని రంగంలోకి దిగాలి.
నిజంగా దృశ్యం 3 మీద వెంకటేష్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారా అంటే ఔననే సమాధానమే సన్నిహితుల మధ్య వినిపిస్తోంది. రాంబాబు తాము హత్య చేసిన శవాన్ని చివరికి అతని తల్లి తండ్రులకు చేర్చడా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. అన్నింటికన్నా ముందు మోహన్ లాల్ సినిమా వచ్చేస్తుంది కాబట్టి జనం ఆగలేక దాన్ని చూసేస్తారు. ట్విస్టులు రివీల్ అయిపోతాయి. వాయిదా వేసే ఛాన్స్ అయితే లేదు. ఓటిటి అగ్రిమెంట్లు అయిపోయాయి కనక ఆలస్యం చేయడానికి లేదు. మల్లువుడ్ వర్గాల ప్రకారం దృశ్యం 3 బిజినెస్ కేరళలోనే అత్యథిక నెంబర్లతో ఓపెన్ కావొచ్చని ట్రేడ్ టాక్. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది మరి.