hyderabadupdates.com Gallery రాఘ‌వ్ చ‌ద్దా రాజీనామా బీజేపీలోకి జంప్

రాఘ‌వ్ చ‌ద్దా రాజీనామా బీజేపీలోకి జంప్

రాఘ‌వ్ చ‌ద్దా రాజీనామా బీజేపీలోకి జంప్ post thumbnail image

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆప్ ఆరోప‌ణ‌లు చేసిన విధంగానే ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను ఆప్ కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తన‌తో పాటు మ‌రో ఆరుగురు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆప్ రాజ్యసభ ఎంపీలలో మూడింట 2/3 వంతు మంది కూడా విలీనం అవుతున్నారని అన్నారు. రాఘవ్ చద్దా ద్రోహం చేశారని ఆప్ ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా సరైన సమయంలో పంజాబ్, భారతదేశ ప్రజలు సమాధానం చెబుతారని పేర్కొంది.
ఎంపీలలో అధిక శాతం మందితో పాటు తాను కూడా బీజేపీలో చేరనున్నట్లు రాఘవ్ చద్దా ప్రకటించారు. కొన్ని వారాల క్రితం తనను పదవీచ్యుతుడిని చేసిన పార్టీ అధినేత, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది పెద్ద దెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆప్ కు రాజ్య‌స‌భ‌లో 10 మంది ఎంపీల బ‌ల‌గం ఉంది. దాదాపు 7 మంది బీజేపీలోకి జంప్ కానున్నారు. అవినీతిపై సయోధ్య కుదుర్చుకుంటామని హామీలిచ్చి ఒకప్పుడు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు నిజాయితీ రాజకీయాలకు దూరమవుతోందని రాఘ‌వ్ చ‌ద్దా ఆరోపించారు. తాము సంత‌కం చేసి రాజ్య‌స‌భ చైర్మ‌న్, ఉప రాష్ట్ర‌ప‌తి కి పంపించామ‌న్నారు. కాగా బీజేపీలో విలీనమవుతున్న వారిలో హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ ఉన్నారని ఆయ‌న తెలిపారు. వీరితో పాటు రాజిందర్ గుప్తా, విక్రమ్ సహానీ, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌ల పేర్లను కూడా ప్రస్తావించారు.
The post రాఘ‌వ్ చ‌ద్దా రాజీనామా బీజేపీలోకి జంప్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారుఅసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాల‌పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ ఇష్టానుసారం శాస‌న స‌భ‌ను నడుపుతున్నారంటూ ఆరోపించారు. అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ఒక‌సారి ,

Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్Pawan Kalyan: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

    పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు.