hyderabadupdates.com movies రాజమౌళికి దారివ్వబోతున్న రవితేజ?

రాజమౌళికి దారివ్వబోతున్న రవితేజ?

మాస్ మహారాజా కొత్త సినిమా ‘మాస్ జాతర’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరికి అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలని నిర్ణయించారు. ఇన్నిసార్లు సినిమా వాయిదా పడడంపై తమ మీద తామే సెటైర్లు వేసుకుంటూ కొన్ని రోజుల కిందట ఒక వీడియో కూడా చేసింది ‘మాస్ జాతర’ టీం. ఆ సందర్భంలోనే అక్టోబరు 31న సినిమా పక్కాగా విడుదలవుతుందని నొక్కి వక్కాణించారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఆ రోజు కూడా సినిమా రిలీజ్ కాదట. అలా అని ఆ సినిమా ఇంకొన్ని వారాలు వెనక్కి వెళ్తుందేమో అని సందేహించాల్సిన పని లేదు. అక్టోబరు 31నే ‘మాస్ జాతర’ షోలు పడనున్నాయి. కానీ అధికారిక రిలీజ్ మాత్రం నవంబరు 1న అని సమాచారం. 31న ఈ చిత్రానికి పరిమిత సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నారు. తర్వాతి రోజు సినిమా పూర్తి స్థాయిలో విడుదలవుతుంది.

రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల 31న రీ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’లను కలిపి ఒక సినిమాగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘మాస్ జాతర’ను ఒక రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మామూలుగా అయితే రీ రిలీజ్‌లకు ఇలాంటి మిడ్ రేంజ్ సినిమాలు దారి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాజమౌళి అండ్ కో అందరి మీదా రవితేజ సహా మాస్ జాతర టీంలో అందరికీ గౌరవ భావం ఉంది.

‘బాహుబలి’ అంటే తెలుగు సినిమాకు ఒక ప్రైడ్‌లాగా ఫీలవుతారు అందరూ. పైగా రాజమౌళి స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టి రెండు భాగాలను కలిపి ఒకటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఆడియన్స్‌లో కూడా సినిమా పట్ల అమితాసక్తి నెలకొంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 31వ తేదీని ‘బాహుబలి’కి వదిలేసి తర్వాతి రోజు ‘మాస్ జాతర’ను రిలీజ్ చేయబోతున్నారు.

Related Post

Official: Ravi Teja’s Mass Jathara to open with paid premieres in IndiaOfficial: Ravi Teja’s Mass Jathara to open with paid premieres in India

The theatrical trailer of Ravi Teja’s Mass Jathara was unveiled recently, and it’s packed with high-voltage action, promising a complete mass feast. Director Bhanu Bhogavarapu has showcased the Mass Maharaja

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ పొత్తు నిర్విఘ్నంగా కొన‌సాగుతోంది. వాస్త‌వానికి ఏపీ వ‌ర‌కే ఈ పొత్తు కుదుర్చుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలోనూ