hyderabadupdates.com movies రాజాసాబ్-2పై దర్శకుడి క్లారిటీ

రాజాసాబ్-2పై దర్శకుడి క్లారిటీ

ఇండియన్ సినిమాలో ఒక కథను రెండు భాగాలుగా తీయడం, సీక్వెల్స్ చేయడం అనే ట్రెండు బాగా ఊపందుకోవడంలో ‘బాహుబలి’ సినిమా పాత్ర కీలకం. ముఖ్యంగా ఈ మధ్య ప్రభాస్ సినిమా అంటే చాలు.. రెండో భాగం తెరపైకి వచ్చేస్తోంది. సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ లైన్లో ఉండగా.. ‘ఫౌజీ’కి సైతం సీక్వెల్ ఉంటుందని వెల్లడైంది. మరి రెబల్ స్టార్ కొత్త చిత్రం ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. 

దీని గురించి దర్శకుడు మారుతి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్లో చూసిన ‘జోకర్’ షాట్.. పార్ట్-2కు లీడ్ ఇవ్వడం కోసమే పెట్టినట్లు అతను వెల్లడించాడు. ఐతే పార్ట్-2కు ఇంకా స్క్రిప్టు ఏమీ రెడీ కాలేదని కూడా అతను క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి లీడ్ ఇస్తామని.. తర్వాత అన్నీ అనుకూలించడాన్ని బట్టి పార్ట్-2 ఉంటుందని అతను తెలిపాడు.

రాజాసాబ్-2 కోసం ఇప్పుడున్న కథను సాగదీయడం లాంటిదేమీ చేయనని మారుతి స్పష్టం చేశాడు. పార్ట్-2 విషయంలో ఏం చేయాలి అనే విషయంలో తనకు, ప్రభాస్‌కు ఫుల్ క్లారిటీ ఉందని.. కథను సాగదీస్తారేమో అని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు మారుతి. ఇంతకుముందు ఓ సందర్భంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సీక్వెల్ గురించి క్లారిటీగా చెప్పకుండా ‘రాజాసాబ్’ ప్రపంచం కొనసాగుతుందని మాత్రం వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మారుతి మాటల్ని బట్టి చూస్తుంటే.. పార్ట్-2కు లీడ్ ఇచ్చి, ఈ సినిమాకు వచ్చే ఫలితాన్ని బట్టి, ప్రభాస్ వీలును బట్టి కొత్తగా ఇంకో కథ రాసి దాన్ని రాజాసాబ్-2గా తీసుకొస్తారని అర్థమవుతోంది. మరి ఈ నెల 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాజాసాబ్’కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Related Post

సంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదుసంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదు

ఒకే వీకెండ్లో తన సినిమాకు పోటీగా వేరే సినిమా వస్తుంటే.. ఒక చిత్ర బృందంలోని ఏ వ్యక్తి అయినా తమ సినిమాకే ప్రయారిటీ ఇస్తారు. అవతలి సినిమా మీద కూడా అభిమానం ఉంటే.. తన సినిమా తర్వాత దాన్ని కూడా చూడమని చెబుతారు.