hyderabadupdates.com movies  రాజా సాబ్ మెడ మీద ఒత్తిడి కత్తి

 రాజా సాబ్ మెడ మీద ఒత్తిడి కత్తి

ఈ వారం మినహాయిస్తే జనవరి 9 సరిగ్గా అరవై రోజుల దూరంలో ఉంది. అంటే ది రాజా సాబ్ విడుదలకు ఉన్న నిడివన్న మాట. అయితే ఇప్పటిదాకా రెండు టీజర్లు వచ్చాయి కానీ ఒక్క లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. తమన్ చూస్తేనేమో అఖండ 2 పనుల్లో బిజీగా ఉంటూ వాటి తాలూకు ఫోటోలు షేర్ చేసుకుంటున్నాడు కానీ రాజా సాబ్ గురించి సమాచారం ఇవ్వడం లేదు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ సందర్భం వచ్చిన ప్రతిసారి వాయిదా లేదనే రీతిలో సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఇన్ సైడ్ టాక్ అయితే టీమ్ మెడ మీద ఒత్తిడి కత్తి వేలాడుతోందట. ఇటలీ షెడ్యూల్ చేసుకుని వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిందని టాక్.

రాజా సాబ్ మీద ప్రెజెర్ ఎందుకు వచ్చిందనే దానికి రీజన్స్ ఉన్నాయి. మొదటిది విఎఫెక్స్. క్వాలిటీ కోసమే ఏకంగా కంపెనీనే మార్చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గ్రాఫిక్స్ నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే సంకల్పంతో ఉంది. మిరాయ్ కే అంత అవుట్ ఫుట్ చూపించినప్పుడు సహజంగానే రాజా సాబ్ మీద డబుల్ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాలి. రెండోది రీ రికార్డింగ్ కోసం తమన్ కు తగినంత సమయం ఇవ్వాలి. అంటే డిసెంబర్ కీలక భాగం కేటాయించాలి. ప్యాచప్ తో కలిపి ఇంకో పాతిక రోజుల షూట్ బ్యాలన్స్ ఉందనే టాక్ అంతర్గతంగా ఉంది. ఇది నిజమో కాదో టీమ్ నిర్ధారణ చేయాలి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంక్రాంతికి పోటీ పడుతున్న సినిమాల్లో ఎవరూ వెనక్కు తగ్గే అవకాశం లేకపోవడం రాజా సాబ్ స్క్రీన్ కౌంట్ మీద ప్రభావం చూపించనుంది. అందరికంటే ముందు వచ్చినా మూడు రోజుల తర్వాత నుంచే కొత్త సినిమాలకు దారి ఇవ్వాల్సి ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, జన నాయకుడు, పరాశక్తిలతో పాటు నారి నారి నడుమ మురారి వచ్చే ఛాన్స్ ఉంది. బాహుబలి నుంచి సోలోగా వస్తున్న ప్రభాస్ కు ఇదంతా ఇబ్బంది కలిగించే కాంపిటీషనే. ఇది పక్కనపెడితే రాజా సాబ్ ఇకపై ఎలాంటి బాంబు వేయకుండా జనవరి 9నే రావాలని ఫ్యాన్స్ మొక్కేసుకుంటున్నారు.  

Related Post

ఏవండీ.. జాగ్ర‌త్త‌: బాబుకు భువ‌నేశ్వ‌రి, జ‌గ‌న్‌కు భార‌తి జాగ్ర‌త్త‌లు!ఏవండీ.. జాగ్ర‌త్త‌: బాబుకు భువ‌నేశ్వ‌రి, జ‌గ‌న్‌కు భార‌తి జాగ్ర‌త్త‌లు!

ఏపీ ముఖ్య‌మంత్రిగా నిత్యం బిజీగా ఉంటున్న చంద్ర‌బాబు, విప‌క్ష(ప్ర‌ధాన కాదు) నేత‌గా, మాజీ ముఖ్య మంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దీపావ‌ళి వేళ స‌తీమ‌ణుల‌తో క‌లిసి పండుగను ఘ‌నంగా జ‌రుపుకొన్నారు. అయితే.. ఇరువురు క‌లిసికాదు.. వేర్వేరుగానే సుమా!. చంద్ర‌బాబు త‌న

నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!

చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.