hyderabadupdates.com movies రాజ్ కుమార్ అంటే పేరు కాదు… ఫైర్ !

రాజ్ కుమార్ అంటే పేరు కాదు… ఫైర్ !

ఇప్పటి తరంలో శివరాజ్ కుమార్, రాజ్ కపూర్, డాక్టర్ రాజ్ కుమార్ లాంటోళ్ళు గురించి కొంచెం అవగాహన కలిగి ఉంటారు కానీ బాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన రాజ్ కుమార్ గురించి కూడా తెలుసుకోవాలి. వందేళ్ల క్రితం బలూచిస్తాన్ లో ఉండే కశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించిన ఈయన ఎస్ఐగా పని చేస్తున్న టైంలో 1952 ‘రంగేళి’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. అయిదేళ్ల తర్వాత నర్గిస్ తీసిన ‘మదర్ ఇండియా’ రాజ్ కుమార్ కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వక్త్, పైగామ్, దిల్ ఏక్ మందిర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ స్టార్ ని చేసింది.

రాజ్ కుమార్ ముక్కుసూటిగా ఉండేవారు. ఏదైనా మొహం మీద చెప్పేయడం, కోపం వస్తే అణుచుకోకపోవడం ఆయన శైలి. పైగామ్ సినిమాలోని ఒక సన్నివేశంలో సహ నటుడు దిలీప్ కుమార్ తన చెంప మీద గట్టిగా కొట్టాడని ఆగ్రహించిన రాజ్ కుమార్ ఏకంగా ముప్పై సంవత్సరాలకు పైగా ఆయనతో కలిసి నటించనని శపథం చేసి అదే మాట మీద నిలబడ్డారు. 1993లో దర్శక నిర్మాత సుభాష్ ఘాయ్ అతి కష్టం మీద ఒప్పించాక సౌదాగర్ లో చేతులు కలిపారు. అంత మొండిపట్టు ఆయనది. ఎదురుగా ఉన్నది అమితాబ్ బచ్చన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా మనసులో ఉన్నది కొట్టినట్టు చెప్పడం ఆయనకు మాత్రమే సొంతమైన శైలి.

వందలోపే సినిమాల్లో నటించినప్పటికీ రాజ్ కుమార్ ఏనాడూ వేషాల కోసం వెంపర్లాడలేదు. ఎక్కువ నటించాలని తాపత్రయపడలేదు. చనిపోయాక సెలబ్రిటీల అంతిమ యాత్రలా తనకు హడావిడి చేయకూడదని ముందే కోరుకోవడంతో 1996లో ఆయన చివరి శ్వాస తీసుకున్నాక కుటుంబ సభ్యులు బయటి ప్రపంచానికి అది తెలియనివ్వకుండా సైలెంట్ గా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తర్వాత మీడియాకు, పరిశ్రమకు చెప్పారు. బుల్లెట్లు వదిలినట్టు డైలాగులు చెబుతున్నారని పేరున్న రాజ్ కుమార్ చివరి వరకు ఆ బ్రాండ్ ని అలాగే నిలబెట్టుకున్నారు. ఆయన శతజయంతి వేళ అభిమానులకు గుర్తొచ్చే జ్ఞాపకాలు ఎన్నో.

Related Post

జ‌గ‌న్ అప్పుల‌కు వ‌డ్డీలు తగ్గించిన చంద్రబాబుజ‌గ‌న్ అప్పుల‌కు వ‌డ్డీలు తగ్గించిన చంద్రబాబు

ఏపీలో జ‌గ‌న్ ప‌రిపాల‌నా కాలంలో చేసిన అప్పుల కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా గాడి త‌ప్పింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దానిని స‌రిదిద్దేందుకు త‌మ‌కు స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌న్నారు. లెక్క‌కు మించి.. అందిన కాడికి అప్పులు చేశార‌ని.. ఈ సొమ్మును

D55: Mammootty joins ensemble cast of Dhanush starrer with Amaran director Rajkumar PeriasamyD55: Mammootty joins ensemble cast of Dhanush starrer with Amaran director Rajkumar Periasamy

Earlier, the makers had announced that the film would feature actresses Sreeleela and Sai Pallavi as co-leads. Interestingly, this marks the second time Sai Pallavi has appeared alongside Dhanush, following