hyderabadupdates.com Gallery రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో

రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి నోరు విప్పారు. ఆయ‌న ఏబీఎన్ రాధాకృష్ణ‌పై భ‌గ్గుమ‌న్నారు. శ‌నివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. సింగ‌రేణి టెండ‌ర్ల ర‌ద్దుపై స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న నిప్పులు చెరిగారు రాధాకృష్ణ‌. ఆధారాలు లేకుండా ఎలా దుష్ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇలాగే నువ్వు గీత దాటితే ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు సైతం తాను వెనుకాడ‌బోనంటూ స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని అనుమానం వ్య‌క్తం చేశారు. రాధాకృష్ణ తొలి పలుకుల నినాదం వెనుక ఎవరి హస్తం ఉందో తానే చెప్పాల‌న్నారు. ఏ రాబందులా? ఏ గద్దల? ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు ప్ర‌సారం చేశార‌నేది తేలాల్సి ఉంద‌న్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావు లేద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగా నిలిచిన సింగరేణి సంస్థపై పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలతో రాధాకృష్ణ చేస్తున్న తొలి పలుకు కథనాలు సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి బాధ్యతా రాహిత్య చర్యలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియాకు కూడా హ‌ద్దు అనేది ఉంటుంద‌న్నారు. దానిని గ‌మ‌నించి న‌డుచు కోవాల‌ని హిత‌వు ప‌లికారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు.
The post రాధాకృష్ణా రాసిందంతా త‌ప్పు అని ఒప్పుకో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడిఅగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్రంలో అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగిన ‘జాతీయ అగ్నిమాపక వారోత్సవాల’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపక

MLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దుMLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

  బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్‌ కాంగ్రె‌స్ లోకి మారిన సీనియర్‌ నాయకుడు ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్‌ దేబాంగ్సు

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపుTTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

  తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు