hyderabadupdates.com movies రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా కొన్ని నెలల ముందు ప్రకటించినపుడు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంత ఖర్చు చేసి బిజినెస్ ఎలా వర్కవుట్ చేస్తారు.. రికవరీ ఎలా సాధ్యం అని అందరూ చర్చించుకున్నారు. కానీ ఈ సినిమాకు ఉన్న పొటెన్షియాలిటికీ ఆ ఖర్చు ఎక్కువేమీ కాదని.. బిజినెస్ కూడా వర్కవుట్ చేయగలమనే ధీమాగా చెబుతున్నాడు నమిత్ మల్హోత్రా. 

ఇంతకీ ఈ సినిమాకు ఆయన ఆ స్థాయిలో ఎలా డబ్బులు పెట్టగలుగుతున్నారు.. ఆ బడ్జెట్ అంతా ఎలా సమకూరింది అన్నది ఆసక్తికరం. ఆయన వేరే సంస్థల భాగస్వామ్యం కూడా కోరుకోకుండా సొంతంగా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇంత బడ్జెట్ ఎలా సమకూర్చుకున్నారనే విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు నమిత్ మల్హోత్రా.

‘‘అవును.. రామాయణం మీద నేను 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో విజువల్స్‌, గ్రాండియర్‌ను అందరూ ప్రశంసించారు. రామాయణం పార్ట్-1 చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తీయాలనుకున్నపుడు భారీగానే చేయాలనుకున్నాం. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న నటుడితో పాటు అందరికీ ఒకటే అనుమానం కలిగింది.. ఈ సినిమాను ఇంత భారీగా తీయడానికి అవసరమైన నిధులు ఉన్నాయా అని. ఐతే నేను ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి అప్పు చేయకుండా మొదటి భాగాన్ని పూర్తి చేయగలిగాను. ఆ డబ్బులన్నీ ఎలా వచ్చాయో నాక్కూడా తెలియదు. 

ఎలా ఇది సాధ్యమైంది అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఈ ప్రాజెక్టు దానంతట అదే డబ్బులు సమకూర్చుకుంది. ఇది కేవలం ఒక సినిమా ప్రాజెక్టు కాదు. దీన్ని బిజినెస్ కోణంలో కూడా చూడకూడదు. ఈ సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చవుతుందో కూడా నాకు తెలియదు. నేను ఏ రోజుకు ఆ రోజు ఖర్చులు చూసుకోవట్లేదు. మనం సరైన సినిమా తీస్తున్నామా లేదా అన్నదాని మీదే నా దృష్టంతా. ఆ విషయంలో ఎంతమాత్రం రాజీపడట్లేదు’’ అని నమిత్ వెల్లడించాడు.

Related Post

I’m indebted to NTR for Kantara Chapter 1 – Rishab ShettyI’m indebted to NTR for Kantara Chapter 1 – Rishab Shetty

Multi-talented actor-writer-director Rishab Shetty delivered a devotional epic blockbuster with his Kantara Chapter 1. The movie has collected huge Rs.509.25 crores+ gross worldwide in first week and it is running

చీమ చిటుక్కుమన్నా భయం.. భయం..చీమ చిటుక్కుమన్నా భయం.. భయం..

చీమలంటే ఆమెకు భయం.. ఆ భయమే ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పింది. నమ్మడానికి ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాలో చీమలంటే భయంతో పాతికేళ్ల మనీషా