hyderabadupdates.com movies రామ్ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు

రామ్ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు

ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న సెలబ్రెటీల జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు ఏముంటాయి అనుకుంటాం. కానీ వాళ్ల జీవితాల్లో జనాలకు తెలియని కోణాలుంటాయి. లెజెండరీ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ అన్న కొడుకైన రామ్ టీనేజీలోనే, తొలి సినిమా ‘దేవదాసు’తోనే స్టార్ ఇమేజ్ సంపాదించేశాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐతే చిన్నప్పట్నుంచి రిచ్‌గా బతికిన అతడి కుటుంబం.. ఒక దశలో సంక్షోభం చూసిందట. ఏమీ లేని స్థితిలో ఫ్యామిలీ రోడ్డు మీదికి వచ్చేసిందట. ఆ స్థితి నుంచి తాము ఎలా కష్టపడి ఎదిగామో రామ్.. జగపతి బాబు నిర్వహిస్తున్న టీవీ షోలో వెల్లడించాడు.

‘‘నా గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. అమ్మ వాళ్లది హైదారబాద్ కావడంతో నేను ఇక్కడే పుట్టాను. తర్వాత కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్లాం. మాది కలిగిన కుటుంబమే. కానీ 1988లో విజయవాడలో కుల ఘర్షణలు జరిగాయి. వాటి వల్ల ఒక రాత్రిలో మేమంతా జీరో అయిపోయాం. అప్పటి వరకు మేం సంపాదించిందంతా కోల్పోయాం. విజయవాడలో ఉండలేక చెన్నైకి వెళ్లిపోయాం.

మేం ఎంత దెబ్బ తిన్నాం, మా జీవితాలు ఎలా మారిపోయాయి అనడానికి ఒక ఉదాహరణ చెబుతా. విజయవాడలో ఉణ్నపుడు నా బొమ్మల కోసమే ఒక పెద్ద గది ఉండేది. చెన్నైకి మారినపుడు ఆ బొమ్మల గదితో పోలిస్తే మా ఇల్లు సగం కూడా లేదు. పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లి సర్దుకున్నాం. నాన్న మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టారు. కానీ కింది నుంచి కష్టపడి ఒక స్థాయికి రావడం వేరు. కష్టపడి పైకి వచ్చాక మొత్తం కోల్పోయి, మళ్లీ కింది నుంచి మొదలుపెట్టడం వేరు. మా నాన్న ఎన్నో అప్‌ అండ్ డౌన్స్ చూశారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం’’ అని రామ్ వెల్లడించాడు.

Related Post

ప్రీమియర్ డే: కాంత మీదే అందరి కన్నుప్రీమియర్ డే: కాంత మీదే అందరి కన్ను

ఇవాళ సాయంత్రం కాంత ప్రీమియర్లు జరగబోతున్నాయి. కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న నిర్మాతలు తమిళ మీడియాకు నిన్నే షో వేశారు. సినిమా చాలా బాగుందంటూ, దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో పొగుడుతున్న వైనం అంచనాలు

బాబుతో `క‌లిసి` వెళ్ల‌డం వెనుక మోడీ వ్యూహం ఇదేనా?!బాబుతో `క‌లిసి` వెళ్ల‌డం వెనుక మోడీ వ్యూహం ఇదేనా?!

“ఫ‌లానా వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయండి.. ఫ‌లానా పార్టీతో చేతులు క‌ల‌పండి!“ అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ ఎవ‌రికీ చెప్పిన‌ట్టు లేదు. ఒక‌వేళ చెప్పినా.. ఆయ‌న బ‌హిరంగ వ్యాఖ్య‌లు కూడా చేసింది లేదు. కానీ, తొలిసారి ఏపీలోని