hyderabadupdates.com Gallery రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం

రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం

రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం post thumbnail image

హైద‌రాబాద్ : బిగ్ బాస్ స్టార్ శ్రీ స‌త్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ హీరో రామ్ పోతినేని గురించి తాజాగా స్పందించింది. త‌నంటే చాలా ఇష్ట‌మ‌ని, త‌ను లేకుండా నేను ఉండ‌లేనంటూ పేర్కొంది శ్రీ స‌త్య‌. అంతే కాదు త‌న‌కున్న విప‌రీత‌మైన అభిమానాన్ని చాటుకుంది ఈ ముద్దుగుమ్మ‌. బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొంది. ఇదిలా ఉండ‌గా ఉస్తాద్ అనే టైటిల్ ను ప్ర‌క‌టించారు. ఇందులో ముఖ్య భూమిక పోషించాడు రామ్ పోతినేని. త‌ను గ‌త ఏడాది ఆంధ్రా కింగ్ మూవీలో న‌టించాడు. అది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీ స‌త్య మాట్లాడుతూ రామ్ పోతినేని సినిమాలో సోద‌రి పాత్ర త‌ప్పా ఏ పాత్ర ఇచ్చినా చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
రామ్ పోతినేని అంటే త‌న‌కు ప్రేమ అని పేర్కొంది. దాదాపు ఏ పాత్రలోనైనా నటించడానికి తాను ఇష్టపడతానని స్ప‌ష్టం చేసింది. సహజంగానే, అవకాశం వస్తే హీరోయిన్‌గా నటించాలని బలమైన కోరికను వ్యక్తం చేసింది. త‌న‌ కెరీర్ గురించి శ్రీ సత్య మాట్లాడుతూ, ఈ మధ్య తనకు టీవీ సీరియల్ ఆఫర్లు పెద్దగా రావడం లేదని తెలిపింది. సరైన స్క్రిప్ట్ తన వద్దకు వచ్చే వరకు ఓపికగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఇక శ్రీ స‌త్య ఇప్ప‌టికే జ‌నాద‌ర‌ణ పొందింది. టెలివిజ‌న్ సీరియ‌ల్స్ ల‌లో కూడా న‌టించింది. త‌ను నిన్నే పెళ్లాడుతా, త్రిన‌య‌ని సీరియ‌ల్స్ ల‌లో న‌టించింది.
The post రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నెలాఖ‌రు లోగా లక్ష ఇందిర‌మ్మ ఇళ్ల గృహ ప్రవేశాలునెలాఖ‌రు లోగా లక్ష ఇందిర‌మ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నెలాఖ‌రు లోగా ల‌క్ష ఇళ్ల‌లో గృహ ప్ర‌వేశాలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్రణాళిక లో భాగంగా

జ‌గ‌న్ మోసాల‌కు, అబద్ధాలకు కేరాఫ్ : ఎస్. స‌వితజ‌గ‌న్ మోసాల‌కు, అబద్ధాలకు కేరాఫ్ : ఎస్. స‌విత

అమరావతి : మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అని, ఆయనకు విజన్ లేదు రాష్ట్రం గురించి ఆలోచన లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసి

అంద‌రి క‌ళ్లు నేష‌న‌ల్ క్ర‌ష్ మంద‌న్నా పైనేఅంద‌రి క‌ళ్లు నేష‌న‌ల్ క్ర‌ష్ మంద‌న్నా పైనే

హైద‌రాబాద్ : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాల‌పై ఉన్నాయి. ఈ ఇద్ద‌రూ క‌లిసి గ‌తంలో విజ‌య‌వంత‌మైన ప‌రుశురామ్ తీసిన గీత గోవిందం మూవీలో న‌టించారు. ఈ ఇద్ద‌రి పెయిర్ కు మంచి మార్కులు ప‌డ్డాయి. మ‌రోసారి ఈ