hyderabadupdates.com movies రావాలి జగన్..కావాలి మావిగన్!

రావాలి జగన్..కావాలి మావిగన్!

“రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్… రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్….’’ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పాట మార్మోగింది. జగన్ గెలుపునకు ఈ పాట దోహదం చేసిందని వైసీపీ నేతలు అంటుంటారు. ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం రూపొందించిన పాట యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ కూడా సొంతం చేసుకోవడం మరో విశేషం.

అందుకే కాబోలు… తమకు అచ్చొచ్చిన ఈ పాట పల్లవిని వైసీపీ శ్రేణులు మరోసారి వాడేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. అందుకే, ’‘రావాలి జగన్’..కావాలి మావి‘గన్’..’’ అంటూ తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు భారీ సైజులో ఫ్లెక్సీలు వెలిశాయి.

జగన్ చెప్పిన మావిగన్ థియరీపై ఇటు ఓ వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే, జగన్ చెప్పిన మావిగన్ థియరీని వైసీపీ నేతలు, కార్యకర్తలు సమర్థిస్తూ కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న మావిగన్ గురించి జగన్ మరోసారి మాట్లాడడంతో వైసీపీ శ్రేణులు మావిగన్ పై ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.

రావాలి జగన్..కావాలి జగన్ పాట స్ఫూర్తితో రావాలి జగన్..కావాలి మావిగన్ అంటూ క్యాచీ లైన్లతో ప్రజల్లోకి మావిగన్ ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మావిగన్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని, మావిగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, ఏపీ బాగుండాలన్నా, త్వరగా డెవలప్ కావాలన్నా మావిగన్ కారిడార్ రావాల్సిందేనని, జగన్ సీఎం కావాల్సిందేనని ఫ్లెక్సీలు వెలిశాయి.

అయితే, ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఏపీకి రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిన జగన్, మరో ఛాన్స్ ఇస్తే పబ్జీలో గన్ తో ఆడుకున్నట్లు మావి‘గన్’ తో రాష్ట్రంతో ఆడుకుంటారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Related Post

D/o Prasad Rao: Kanabadutaledu – A Tense Father’s Search Turns TragicD/o Prasad Rao: Kanabadutaledu – A Tense Father’s Search Turns Tragic

D/o Prasad Rao: Kanabadutaledu is a Telugu language crime-thriller web series streaming from February 27, 2026 on ZEE5. Directed by Krishna Poluru, the series stars Rajeev Kanakala as a father,