hyderabadupdates.com movies రావిపూడి చెప్పిన ప్రమోషన్ల మంత్రం

రావిపూడి చెప్పిన ప్రమోషన్ల మంత్రం

ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట ప్రమోషన్లు ఎంత ఎక్కువగా చేసుకుంటే చిన్న సినిమాలకు అంత ఓపెనింగ్స్ వస్తాయని. కానీ ఇది నిజం కాదనేది ఓపెన్ సీక్రెట్. ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంట్ తప్ప మరొకటి కాదు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అనిల్ రావిపూడి ఈ విషయాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.

ఆడియన్స్ ఇప్పుడు చాలా స్మార్ట్ గా ఉన్నారని, ఒక టీజర్ ట్రైలర్ తో టికెట్లు తెంపాలా వద్దాని నిర్ణయించుకుంటున్నారని, కేవలం ప్రమోషన్లతో అటెన్షన్ తీసుకురాగలం కానీ జనాన్ని థియేటర్ దాకా రప్పించేది మాత్రం కంటెంటేనని ఓపెన్ స్టేజి మీద కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.

ఇది ముమ్మాటికీ రైటే. కానీ ఇక్కడ రెండు కోణాలను చూడాలి. జనాలను టికెట్లు కొనేలా చేయడంలో ముందుగా దోహదం చేస్తున్నది ప్రమోషన్లే. లిటిల్ హార్ట్స్ కి ఎంత బడ్జెట్ అయ్యిందో అంతే సొమ్ము మార్కెటింగ్ కోసం ఖర్చు పెట్టారు. దాని ఫలితంగానే వసూళ్లు ముప్పై కోట్లు దాటేశాయి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి ఇలాంటి ప్లానింగ్ లేకపోవడం వల్లే పాజిటివ్ టాక్ ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయింది.

అలాని కేవలం పబ్లిసిటీ చేస్తే జనాలు వచ్చేయరు. కొన్ని ప్యాన్ ఇండియా సినిమాలకు మన హీరోలు ముంబై, చెన్నై వెళ్లి మరీ ప్రచారాలు చేశారు. కానీ వాటికి కనీసం పబ్లిసిటీ, ఫ్లైట్ ఖర్చులు కూడా వసూలు కాలేదు.

ప్రమోషన్లకు ఒక బ్రాండ్ గా మారిపోయిన అనిల్ రావిపూడి వెంకటేష్, చిరంజీవి లాంటి స్టార్లను హ్యాండిల్ చేస్తున్నా సరే తనదైన మార్కుతో ప్రచారాలు చేస్తూనే ఉంటాడు. నయనతారని ఒప్పించడం లాంటివి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దండోరా ప్రస్తుతం బాగానే అటెన్షన్ తెచ్చుకుంటోంది. పోటీ దృష్ట్యా రెండు రోజుల ముందే ప్రీమియర్లకు సిద్ధ పడటం చూస్తే కంటెంట్ మీద ఓ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

ఒక్క విషయంలో రావిపూడిని మెచ్చుకోవాలి. శివశంకరవరప్రసాద్ పనుల్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ వేరే ఈవెంట్లకు అడగ్గానే వచ్చి మాట సాయం చేస్తున్నాడు.

#AnilRavipudi’s ADVICE:“PROMOTIONS అనేవి సినిమా ATTENTION GRAB చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి.CONTENT మాత్రమే THEATRE లో TICKET తెప్పించగలదు.AUDIENCES ARE VERY SMART.” pic.twitter.com/Gzkbi9upRG— Gulte (@GulteOfficial) December 22, 2025

Related Post

Mohan Babu’s MB50 Gala Becomes a Grand Reunion of Cinema and Political IconsMohan Babu’s MB50 Gala Becomes a Grand Reunion of Cinema and Political Icons

Collection King Dr. Mohan Babu’s 50-year celebration, MB50, turned into one of the biggest and most glamorous gatherings of the year, bringing together top stars, political leaders, and industry heavyweights

శ్రీను వైట్ల సినిమా మామూలుగా ఉండదటశ్రీను వైట్ల సినిమా మామూలుగా ఉండదట

ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు శ్రీను వైట్ల. పెద్ద స్టార్లతోనూ కామెడీ చేయించొచ్చని.. తద్వారా భారీ విజయాలు అందుకోవచ్చని రుజువు చేసిన దర్శకుడాయన. ముఖ్యంగా కింగ్,