hyderabadupdates.com Gallery రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం

రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం

రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026-2027 బడ్జెట్ లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఇతర వసతులపై డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ తీసుకు వచ్చి, క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ఆటల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా క్రీడా శాఖకు 2026-2026 బడ్జెట్ లో అధిక నిధుల కేటాయింపుతో పాటు, క్రీడాకారులకు ఆర్థిక సహాయంపై అధికారులతో చర్చించారు. ఒలంపిక్, పారా ఒలంపిక్, అంతర్జాతీయ, జాతీయ ఆటల పోటీల్లో పతకాలు సాధించిన వారికి ఆర్థిక సహాయం అందించేలా బడ్జెట్ లో కేటాయింపులు ఉండేలా ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సహంతోనే విద్యార్థులు, యువకులు క్రీడల్లో రాణిస్తారని మంత్రి స్ప‌ష్టం చేశారు. క్రీడాకారులకు ఇచ్చే పారితోషికాలపై విధి విధానాలు రూపొందించాలని, వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ MD సోనీ బాలాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

APEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టంAPEPDCL: మొంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్ కు 10 కోట్లు నష్టం

  మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. బుధవారం కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విద్యుత్‌ పునరుద్ధరణ చర్యల పురోగతిని ఆయన వివరించారు. అన్ని సెక్షన్ కార్యాలయాలకు జనరేటర్లు,

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్యYatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య (Yatindra Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో

అమరజీవి ప్రాణ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయంఅమరజీవి ప్రాణ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం

అమరావతి : పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 125