hyderabadupdates.com Gallery రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం

రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం

రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్ర‌థ‌మ‌ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి, సాగులో తీసుకోవలసిన మెళకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు, తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కలిగించడమే రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
రైతుల ప్రతీ సమస్యను ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కార దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర జిఎస్డిపి లో వ్యవసాయం 50 వేల కోట్ల రూపాయలు ఉంటే, ఉద్యానవన శాఖ 1. 68 లక్షల కోట్లు ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి ఆదాయం అందించేలా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు కింజార‌పు అచ్చెన్నాయుడు. ఉద్యానవన రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు, ఆటోమేషన్ అందిస్తున్నామన్నారు. విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సును త్వరలో పెద్దఎత్తున నిర్వహించి ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ని ఏర్పాటు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు.
The post రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌

లాహోర్ : ఫిబ్ర‌వ‌రి నెల‌లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి భార‌త్, శ్రీ‌లంక దేశాలు. ఈ సంద‌ర్బంగా భార‌త్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. ఈ

వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీవన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీ

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్‌ప్రెన్యూయర్ విధానంపై చ‌ర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి