hyderabadupdates.com Gallery రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు

రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు

రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ‌లో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అడిగిన ప్రశ్నకు స‌మాధానం ఇచ్చారు. నియమ నిబంధనలను అనుసరించే విద్యుత్ పంపిణీ లైన్లు వేస్తున్నామ‌ని చెప్పారు. విద్యుత్ లైన్లు వేసిన తరువాత వాటి కింద ఇళ్ల నిర్మాణంతోనే భద్రతా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అవగాహన లోపం, లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ప్రమాదంగా మారిన విద్యుత్ లైన్లు గుర్తిస్తే అధికారులకు సమాచారం వెంట‌నే అందించాల‌ని కోరారు.
లైన్లు, స్తంభాల మార్పిడికి సంబంధీకులు దరఖాస్తు చేస్తే లైన్లు మార్చుతామ‌ని స్పష్టం చేశారు విద్యుత్ శాఖ మంత్రి. విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఎంపీ నిధుల ద్వారా లైన్ల మార్పిడి చేపట్టామ‌ని తెలిపారు. ప్రాణాల కంటే ఏదీ విలువైంది కాదని అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించామ‌ని చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. ఇదిలా ఉండ‌గా ఎక్కువ‌గా రైతులు పామాయిల్ తోటల్లో కోత కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ప్రతీ జిల్లాకు రూ. కోటి మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. విద్యుత్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వకూడద‌ని స్పష్టం చేశారు.
The post రూల్స్ కు అనుగుణంగానే విద్యుత్ లైన్ల ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గేఇంటిల్లిపాదికి ‘అన‌గ‌న‌గా ఒక రోజు’ పండ‌గే

హైద‌రాబాద్ : యంగ్ హీరో, హీరోయిన్లు న‌వీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన తాజా చిత్రం అన‌గ‌న‌గా ఒక రోజు పాజిటివ్ టాక్ ను స్వంతం చేసుకుంది. ప‌లు సినిమాలు సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. మెగాస్టార్

వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీవన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ పాల‌సీ

దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్‌ప్రెన్యూయర్ విధానంపై చ‌ర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి

స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాంస‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తేనే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగిస్తాం

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఉద్దేశించి. ఆషామాషీగా ఐఏఎస్ లు కాలేర‌ని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా