hyderabadupdates.com Gallery రూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా

రూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా

రూ. 37.12  కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాణ‌వాయువును అందించే పార్కుల క‌బ్జాల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. ఫిర్యాదు అందిన వెంట‌నే రంగంలోకి దిగి వాటిని ర‌క్షిస్తోంది. ఇలా ఒకే రోజు ఒకే కాల‌నీలో 6 పార్కుల‌ను కాపాడి 2260 గ‌జాల స్థ‌లానికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మ‌రో చోట 1452ల గ‌జాల‌కు పైగా ఉన్న పార్కు స్థ‌లాన్ని క‌బ్జాల నుంచి విడిపించింది. మొత్త‌మ్మీద 3712 గ‌జాల విస్తీర్ణంలో పార్కులు అందుబాటులోకి రావ‌డంతో ఆయా ప్రాంతాల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. స్థానికులు పెద్ద ఎత్తున‌ బ‌య‌ట‌కు వ‌చ్చి పార్కుల క‌బ్జాల‌ను తొల‌గించిన హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డుల ముందు ఫొటోలు దిగారు. భారీ ర్యాలీలు తీసి సంబ‌రాలు చేసుకున్నారు. ఈ పార్కుల విముక్తికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.
మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బులా్ల‌పూర్ మండ‌లం జీడిమెట్ల విలేజ్‌ సుభాష్ న‌గ‌ర్ ప‌రిధిలోని భాగ్య‌ల‌క్ష్మి కాల‌నీ లే ఔట్‌ను 1968లో వేశారు. 80 ఎక‌రాల‌లో 810 ప్లాట్ల‌తో ఈ లే ఔట్ వేసి ఇందులో 10 పార్కుల‌ను కేటాయించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడ‌కు విద్యుత్‌ను అందించేందుకు వేసిన హైటెన్ష‌న్ క‌రెంటు లైను ఈ లే ఔట్ మీదుగా వెళ్లింది. దీంతో హైటెన్ష‌న్ విద్యుత్ లైన్ల కింద ప‌లు పార్కుల‌ను అప్ప‌టి లే ఔట్ వేసిన వారు కేటాయించారు. వేరే లైను ద్వారా పారిశ్రామిక వాడ‌కు విద్యుత్‌ను అందించ‌డంతో భాగ్య‌ల‌క్ష్మి కాల‌నీ మీదుగా వెళ్లే హైటెన్ష‌న్ వైర్ల‌ను 20 సంవ‌త్స‌రాల క్రితం తొల‌గించారు. ఇక అక్క‌డి నుంచి ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయి. స్థానిక అధికారుల‌కు చెప్పినా ప్ర‌యోజ‌నం లేక పోయింద‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు సంబంధిత శాఖ‌ల‌కు చెందిన వారితో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించారు. పార్కు స్థ‌లాలుగా నిర్ధారించుకున్నారు. వ‌రుస‌గా ఉన్న 6 పార్కుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. పార్కు స్థ‌లాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.
The post రూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sobha Group Pledges ₹100 Crore for World-Class Library in Amaravati, CM Naidu Expresses GratitudeSobha Group Pledges ₹100 Crore for World-Class Library in Amaravati, CM Naidu Expresses Gratitude

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu recently conducted an important meeting with PNC Menon, Sobha Group chairman and founder of the Dubai-based leading real estate development company. In a

MBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదంMBBS Seats: కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లు ఎన్ఎంసీ ఆమోదం

    వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు ఎన్ఎంసీ శుభవార్త చెప్పింది. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ఆమోదం తెలియజేసింది. అలాగే కొత్తగా 41 వైద్య కశాళాలలు కూడా రాబోతున్నాయి.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలిమున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్ల‌ను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేయాల‌ని, ఏ ఒక్క సీటు కోల్పోకూడ‌ద‌ని స్ప‌ష్టం