hyderabadupdates.com movies రెజీనా ‘బాలీవుడ్’ బాధలు

రెజీనా ‘బాలీవుడ్’ బాధలు

తమిళంతో పాటు తెలుగులోనూ ఒక దశలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా ఉండేది రెజీనా కసాండ్రా. పెద్ద హీరోల సరసన సినిమాలు చేయలేదన్న మాటే కానీ.. మిడ్ రేంజ్‌ స్టార్ హీరోలతో చాలా చిత్రాల్లోనే నటించింది. తెలుగులో రవితేజ, గోపీచంద్, సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ లాంటి కథానాయకులతో ఆమె సినిమాలు చేసింది. తమిళంలో కూడా మంచి అవకాశాలే వచ్చాయి.

ఐతే సౌత్ హీరోయిన్లు చాలామందికి బాలీవుడ్‌లోనూ వెలిగిపోవాలని ఉంటుంది. రెజీనా కూడా ఆ దిశగా ప్రయత్నం చేసింది. అక్కడామె ‘ఏక్ లడ్కీకో దేఖా తో ఐసా లగా’ అనే చిత్రంలో ఆమె నటించింది. అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాలేదు. రెజీనాకు కూడా అంత పేరేమీ రాలేదు. తర్వాత మరి కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది రెజీనా.

ఐతే ఆయా సినిమాల ఫలితాల గురించి పక్కన పెడితే బాలీవుడ్‌లో తన అనుభవం ఏమంత బాగా లేదని అంటోంది రెజీనా. దక్షిణాది కథానాయికగా తనను బాలీవుడ్ వాళ్లు భిన్నంగా చూశారని రెజీనా పేర్కొంది. తనతో అక్కడి వాళ్ల ప్రవర్తనే సరిగా ఉండేది కాదని.. వారి మాటల్లో స్పష్టమైన తేడా ఉండేదని ఆమె చెప్పింది.

ఒక కుచించుకుపోయిన వాతావరణంలో పని చేస్తున్నట్లుగా తనకు అనిపించేదని రెజీనా పేర్కొంది. ఫలితంగా బాలీవుడ్లో పని చేసే విషయంలో తాను ఒక రకమైన భయానికి గురైనట్లు ఆమె వెల్లడించింది.

ఐతే అందరూ తనలా అక్కడ ఇబ్బంది పడతారు అనడానికి లేదని.. తన అనుభవం మాత్రం అంత సానుకూలంగా లేదని రెజీనా చెప్పింది. ఐతే బాలీవుడ్ ఎక్స్‌పీరియన్స్ బాలేదు అంటూనే రెజీనా ఇప్పటికీ అక్కడ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘ది వైవ్స్’, ‘సెక్షన్ 108’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వస్తుండగా.. తెలుగులో మాత్రం దాదాపుగా కెరీర్ క్లోజ్ అయిపోయింది.

Related Post

బాలయ్య మీద ఒత్తిడి పని చేయదుబాలయ్య మీద ఒత్తిడి పని చేయదు

సోషల్ మీడియా ప్రచారాలు కొన్ని భలే విచిత్రంగా ఉంటాయి. వాటిలో బాలయ్య కేవలం నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తారనేది ఒకటి. వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే కమర్షియల్ ఎంటర్ టైనర్

అసలు ఆస్తులే పంచలేదంటున్న విజయమ్మ… అసలు ఆస్తులే పంచలేదంటున్న విజయమ్మ… 

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్. షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత రాజకీయ, కుటుంబ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా