hyderabadupdates.com movies రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవలే ఇండిగో ఫ్లైట్స్ రాద్ధాంతం వల్ల ఢిల్లీ షెడ్యూల్ వాయిదా వేయాల్సి వచ్చింది. అయినా సరే బుచ్చిబాబు టెన్షన్ పడకుండా మిగిలిన బ్యాలన్స్ ని చకచకా పూర్తి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కోటి విమెన్స్ కాలేజీతో పాటు పలు లొకేషన్లలో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నారు. పద్దెనిమిది నుంచి ఢిల్లీలో క్లైమాక్స్ ఘట్టం ప్లాన్ చేశారని తెలిసింది. కుస్తీ ఫైట్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఇవన్నీ జనవరి మధ్యలోపే అయిపోతాయని ఇన్ సైడ్ టాక్.

అయితే ఇప్పుడు అసలు బాధ్యత రెహమాన్ మీద ఉందట. ముఖ్యమైన ఐటెం సాంగ్ ఇంకా ఇవ్వలేదు. అసలే బుచ్చిబాబుది రాజీ పడని మనస్తత్వం. ఇలా ఉండటం వల్లే చికిరి చిక్కిరి లాంటి చార్ట్ బస్టర్ చేయించుకున్నాడు. ఇప్పుడు గురువు సుకుమార్ తీసిన జిగేలు రాణిని మించిన పాట తీయాలని పట్టుదలగా ఉన్నాడు. గతంలో రెహమాన్ ఒకటి రెండు ట్యూన్స్ ఇచ్చినప్పటికీ అవి అంతగా నచ్చకపోవడంతో మళ్ళీ ఫ్రెష్ గా కంపోజ్ చేస్తానని హామీ ఇవ్వడం వల్లే అది పూర్తవ్వలేదని సమాచారం. సో రెహమాన్ కనక ఈ నెలాఖరులోగా ఇవ్వగలిగితే ఫిబ్రవరిలోగా గుమ్మడికాయ కొట్టేసే ఛాన్స్ ఉంటుంది.

ఈ లెక్కన పెద్ది వాయిదా వార్త అబద్ధమే అనుకోవాలి. కాకపోతే హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొమోషన్లు మొదలైపోవడంతో పెద్ది మీద ఫ్యాన్స్ కు డౌట్లు వచ్చాయి. బిజినెస్ డీల్స్, ఓటిటి అగ్రిమెంట్లు అన్నీ మార్చి 27కి అనుగుణంగా జరిగాయి కాబట్టి మార్పు చేయాలంటే మళ్ళీ అదో ప్రహసనంగా మారుతుంది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే సంకల్పం బుచ్చిబాబుది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంస్థల నుంచి పూర్తి సహకారం ఉంది కాబట్టి ప్రొడక్షన్ పరంగా ఎలాంటి టెన్షన్ లేదు. చరణ్ కూడా టార్గెట్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కో ఆపరేట్ చేస్తున్నాడు.

Related Post

Baahubali The Epic Roars Again: Re-release Advance Bookings Cross ₹10 Crore!Baahubali The Epic Roars Again: Re-release Advance Bookings Cross ₹10 Crore!

The mighty Baahubali legacy is back — and it’s rewriting box office history all over again! The epic film series that changed Indian cinema forever, Baahubali: The Beginning and Baahubali: