hyderabadupdates.com Gallery రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్

రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్

రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్ post thumbnail image

జ‌గిత్యాల జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి రెచ్చి పోయారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈనెల 20వ తేదీన కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈమేర‌కు ల‌క్ష మందికి పైగా హాజ‌ర‌య్యేలా స‌భ‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఈ త‌రుణంలో బుధ‌వారం జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా సుదీర్ఘ రాజ‌కీయ అనుభం క‌లిగిన‌, మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా ఎదిగారు . మంత్రిగా ప‌ని చేశారు. నిజాయితీగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రితో క‌లుపుగోలుగా ఉంటూ వ‌చ్చారు జీవ‌న్ రెడ్డి. అందుకే తాను బీఆర్ఎస్ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
రేవంత్‌ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ ప‌ట్టు కోల్పోయిందన్నారు జీవ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని వాపోయారు. నిజాయితీ, నిబ‌ద్ద‌త , అనుభ‌వం క‌లిగిన నేత‌ల‌కు ఆ పార్టీలో స్తానం లేద‌న్నారు. అక్క‌డ ఉండ‌లేక పోతున్నార‌ని, కావాల‌ని అలా చేస్తున్నాడ‌ని రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు జీవ‌న్ రెడ్డి. త‌న‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌న్నారు. విచిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేల‌కు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ నా వయసును గౌర‌విస్తార‌ని, త‌న‌ను అన్నా అని ఆప్యాయంగా పిలుస్తార‌ని చెప్పారు. కేసీఆర్ కు ప్ర‌జ‌లంటే పంచ ప్రాణం అని, నీలాగా కాదంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.
The post రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదలసహకార సంఘాలకు రూ.5 కోట్ల బకాయిల విడుదల

అమరావతి : చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సంక్రాంతి ముంగిట శుభవార్త తెలిపారు. ఆప్కో బకాయిలకు సంబంధించి రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. గతంలో చేనేత

క‌రీంన‌గ‌ర్ బ‌ల్దియాపై బీజేపీ జెండా ఎగుర వేయాలిక‌రీంన‌గ‌ర్ బ‌ల్దియాపై బీజేపీ జెండా ఎగుర వేయాలి

క‌రీంన‌గ‌ర్ జిల్లా : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ స‌ర్కార్ వ‌ల్ల‌నే ఇవాళ మున్సిపాలిటీలు ప్ర‌గతి ప‌థంలో దూసుకు వెళుతున్నాయ‌ని అన్నారు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో

అన్నమయ్య తొలి శతకం భక్తి మార్గానికి దివ్య మార్గదర్శకంఅన్నమయ్య తొలి శతకం భక్తి మార్గానికి దివ్య మార్గదర్శకం

తిరుపతి : తెలుగు భక్తి సాహిత్యంలో అగ్రగణ్యులైన తాళ్ళపాక అన్నమాచార్యులు తొలి వాగ్గేయకారుడిగా విశిష్ట స్థానాన్ని పొందారని అన్నారు విశ్రాంతి తెలుగు ఆచార్యులు శ్రీ గిరిజా మనోహర్ బాబు. సంకీర్తనలలో భాగంగా రూపొందిన “తొలి శతకం” భక్తి, తత్వ, సాహిత్య పరంగా