hyderabadupdates.com movies రొటీన్ ‘లీడర్’తో ఏం సాధించారు

రొటీన్ ‘లీడర్’తో ఏం సాధించారు

2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టి మల్టీలాంగ్వేజెస్ లో ఆయన తీయించిన మాస్టర్ పీస్ కి చాలా చోట్ల పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు. నవ్వుకుందామనో, ట్రోలింగ్ మెటీరియల్ దొరుకుతుందేమోనని థియేటర్లకు కాసింత జనాలు వెళ్లారు కానీ ఆ మూవీ వల్ల నిర్మాత కూడా తానే అయిన శరవణన్ కు పైసా ప్రయోజనం దక్కలేదు.

దీంతో నటనకు స్వస్తి చెబుతారమోనని అందరూ అనుకున్నారు. కానీ నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ ఇచ్చి శరవణన్ కొత్త మూవీతో వచ్చారు. అదే లీడర్. తమిళంతో పాటు తెలుగులోనూ ఇది ఇవాళే రిలీజయ్యింది. బైకర్, రాకాస గోలలో ఇది వచ్చిందనే సంగతే చాలా మందికి తెలియదు. ప్రమోషన్లు లైట్ తీసుకోవడంతో మార్నింగ్ షోకే జనం లేక థియేటర్లు వెలవెలబోయాయి. దొరికిన కాసిన్ని స్క్రీన్లలోనూ కనీస ఆక్యుపెన్సీలు నమోదు చేయలేకపోయింది లీడర్.

సరే ఇంత గ్యాప్ వచ్చింది కదా లీడర్ లో కొత్తగా ఏమైనా ట్రై చేశారేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కూడా రొటీన్ బాపతే. కూతురితో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న హీరో శక్తివేల్ లైఫ్ లోకి కాలకేయ ప్రభాకర్ రూపంలో ఒక విలన్ ప్రవేశిస్తాడు. అప్పటిదాకా బాషా ఫస్టాఫ్ లో రజనీకాంత్ లాగా సైలెంట్ గా ఉన్న శక్తివేల్ కన్నబిడ్డను కాపాడుకోవడం కోసం తన అసలు విశ్వరూపాన్ని బయటికి తీస్తాడు. అక్కడి నుంచి  యాక్షన్ డ్రామా మొదలవుతుంది.

విచిత్రం ఏమిటంటే దీనికి కూడా పెద్ద బడ్జెట్ పెట్టారు. దర్శకుడు దొరై సెంథిల్ కుమార్ వీలైనంత వరకు మాస్ కి టైం పాస్ చేయించే ఎంటర్ టైనర్ ఇవ్వడానికి కష్టపడ్డాడు. జార్జియాలో చాలా రిస్కు తీసుకుని షూట్ చేసిన క్లైమాక్స్ ట్రైన్ ఫైట్ దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. శరవణన్ ని హీరో మెటీరియల్ గా భావించే వాళ్ళు లీడర్ ని ట్రై చేయొచ్చు కానీ మిగిలినవాళ్ళు మాత్రం ఏంటిది అనుకుంటున్నారు. బైకర్ కు మ్యూజిక్ ఇచ్చిన జిబ్రానే ఈ లీడర్ కి సంగీత దర్శకుడు.

Related Post

మౌన వ్రతానికి శుభం కార్డు ఎప్పుడోమౌన వ్రతానికి శుభం కార్డు ఎప్పుడో

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కాలేదు. మెగా 158 నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ మీద రకరకాలా పుకార్లు వ్యాప్తి చెందుతున్న

Laalo Krishna Sada Sahaayate Box Office: Tops 40cr in India with a Superb 5th TuesdayLaalo Krishna Sada Sahaayate Box Office: Tops 40cr in India with a Superb 5th Tuesday

Laalo: Krishna Sada Sahaayate recorded another superb day at the Indian box office yesterday, collecting Rs. 3.50 crore approx. The film experienced robust growth of around 35 per cent from

Dulquer and Rana’s “Kaantha” Premieres in the USA TodayDulquer and Rana’s “Kaantha” Premieres in the USA Today

The much-awaited period drama Kaantha, starring Dulquer Salmaan and Rana Daggubati, is creating waves even before its worldwide release. Directed by Selvamani Selvaraj, the film is jointly produced by Dulquer’s