అమరావతి : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఆథారిటీ (APSADA) కో-వైస్ ఛైర్మన్, నాన్-ఆఫీషియల్ కమిటీ సభ్యులు, అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియా లో వచ్చిన వార్తలు, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మన దేశ సముద్ర ఆహార ఎగుమతులపై చూపే ప్రభావం గురించి చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మధ్యప్రాచ్య (గల్ఫ్) ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు లేదా పానిక్ హార్వెస్టింగ్ చేయడం సరికాదని రైతులకు సూచించారు. భారతదేశం నుండి జరిగే మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లేది కేవలం 3,4 శాతం మాత్రమేనని, అది కూడా ప్రధానంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా జరుగుతుందని తెలిపారు. ఇతర దేశాలకు యూరోపియన్ యూనియన్ (EU), అమెరికా (USA), జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్లే సముద్ర ఆహార కంటైనర్లు రెడ్ సీ సూయెజ్ కాలువ మార్గం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం, చైనా సముద్ర మార్గం ద్వారా నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితులు భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
The post రొయ్యల రైతుల ఆవేదన సర్కార్ ఆలంబన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
రొయ్యల రైతుల ఆవేదన సర్కార్ ఆలంబన
Categories: