hyderabadupdates.com Celeb Gallery రోహిత్ రిటైర్మెంట్‌పై గవాస్కర్!

రోహిత్ రిటైర్మెంట్‌పై గవాస్కర్!

రోహిత్ రిటైర్మెంట్‌పై గవాస్కర్! post thumbnail image

ఇటీవలె వన్డే కెప్టెన్సీ నుండి రోహిత్ శర్మను టీమిండియా సెలెక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్‌ పై వార్తలు రాగా తాజాగా స్పందించారు భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించడం పెద్ద మార్పులకు సంకేతమని అన్నారు. ఇది అంతటితో ఆగిపోదని స్పష్టమని కూడా సూచించారు.

రోహిత్ మరియు విరాట్ కోహ్లీలు 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టమైందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. వయసు కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఆ సమయానికి రోహిత్ 40 ఏళ్లు, కోహ్లీ 39 ఏళ్లకు చేరుకుంటారు. అయితే వారిద్దరికీ ఉన్న ప్రధాన సమస్య “మ్యాచ్ ప్రాక్టీస్” అని గవాస్కర్ అన్నారు.

రోహిత్ మరియు కోహ్లీ టెస్టులు, టీ20ల నుండి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వన్డేలు మాత్రమే వారి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిగిలి ఉన్నాయి. కానీ సమయం గడుస్తున్న కొద్దీ, దక్షిణాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్‌కి సిద్ధమవ్వడం మరింత కష్టతరమవుతుందని ఆయన అన్నారు. అయితే గిల్ కెప్టెన్సీని రోహిత్ వ్యతిరేకించకపోవచ్చన్నారు.

రోహిత్ వ్యక్తిగతంగా చాలా సాధించాడు. చాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ గెలిపించాడు. ఆయన కెప్టెన్సీపై ఎటువంటి సందేహం లేదు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు సంవత్సరాల ముందే యువ కెప్టెన్‌ను సిద్ధం చేయడం అవసరం…. ఈ ఆలోచనతోనే సెలెక్షన్ కమిటీ ముందుకు వెళ్లింది అని తెలిపారు గవాస్కర్. రోహిత్ మరియు కోహ్లీలు మళ్లీ వన్డేల్లోకి రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ (అక్టోబర్ 19న ప్రారంభం)లో జట్టులోకి తిరిగి వస్తారు. తరువాత డిసెంబర్, జనవరి నెలల్లో సిరీస్‌లు కొనసాగుతాయి. అయితే వారు తమ కెరీర్‌ను ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారో కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పారు.

The post రోహిత్ రిటైర్మెంట్‌పై గవాస్కర్! appeared first on Adya News Telugu.

Related Post