hyderabadupdates.com Gallery ‘రౌడీ’ నుంచి ఆహ్వానం అంద‌లేదు : త‌రుణ్ భాస్క‌ర్

‘రౌడీ’ నుంచి ఆహ్వానం అంద‌లేదు : త‌రుణ్ భాస్క‌ర్

‘రౌడీ’ నుంచి ఆహ్వానం అంద‌లేదు : త‌రుణ్ భాస్క‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్ భాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ న‌టుడు, విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి గురించి స్పందించాడు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈనెల‌లోనే ప్ర‌ముఖ న‌టి, నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మికా మంద‌న్నా తో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌టి కాబోతున్నారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో సినీ, వ్యాపార‌, వాణిజ్య, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. ఇదిలా ఉండ‌గా ముందు నుంచీ విజ‌య్ దేవ‌ర‌కొండతో మంచి స్నేహం క‌లిగి ఉన్నాడు త‌రుణ్ భాస్క‌ర్. పెళ్లి వార్త‌ల‌పై త‌న స్పంద‌న తెలియ చేశాడు. ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం రౌడీ జ‌నార్ద‌న్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇందులో కీల‌క పాత్ర పోషించింది అందాల తార భాగ్య‌శ్రీ బోర్సే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, త‌రుణ్ బాస్క‌ర్ మ‌ధ్య బ‌ల‌మైన బంధం ఉంది. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం పెళ్లి చూపులులో ముఖ్య పాత్ర పోషించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇది 2016లో వ‌చ్చింది.
ఈ సినిమాకు మంచి గుర్తింపు ల‌భించింది. ఆ త‌ర్వాత వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అర్జున్ రెడ్డి మూవీ దుమ్ము రేపింది. భారీ క‌లెక్ష‌న్స్ కురిపించింది. దీనిని హిందీ లో కూడా తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. వారి తొలి హిట్ తర్వాత ఈ ఇద్దరూ వృత్తిపరంగా కలిసి పని చేయక పోయినప్పటికీ, మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌య్ పూర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు. దీనిపై స్పందించ‌మ‌ని కోర‌గా త‌రుణ్ భాస్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌కు విజ‌య్ నుంచి ఆహ్వానం అంద‌లేద‌న్నాడు.
The post ‘రౌడీ’ నుంచి ఆహ్వానం అంద‌లేదు : త‌రుణ్ భాస్క‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షాAmit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా

    దిల్లీ పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడాలని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఎర్రకోట సమీపంలో పేలుడు నేపథ్యంలో.. దేశ రాజధాని దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై నేడు ఉన్నతాధికారులతో

2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. తాజా బ‌డ్జెట్ లో ప‌శు పోష‌ణ‌కు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు /

Double Murder: భీమవరంలో దారుణం ! తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి !Double Murder: భీమవరంలో దారుణం ! తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి !

  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుంకర పద్దయ్య గారి వీధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి, తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం… గునుపూడి