hyderabadupdates.com movies లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?

లెజెండరీ దర్శకుడికి… నిర్మాతలు లేరా?

తెలుగులో ఎందరో స్టార్, లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్లందరిలో క్రియేటివ్ డైరెక్టర్ అని ట్యాగ్ తెచ్చుకున్నది మాత్రం ఒక్క కృష్ణవంశీ. రామ్ గోపాల్ వర్మ శిష్యరికంలో రాటుదేలి.. తొలి చిత్రం గులాబీతోనే గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న కృష్ణవంశీ.. తర్వాత నిన్నే పెళ్లాడతా, సింధూరం, ఖడ్గం, మురారి, చందమామ లాంటి కల్ట్ మూవీస్ అందించి తెలుగు సినీ చరిత్రలో దర్శకుడిగా తనకో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

ఐతే ఎంత గొప్ప దర్శకుడైన ఏదో ఒక దశలో వరుస ఫ్లాపులు ఎదుర్కోవడం, కెరీర్లో డౌన్ అవ్వడం మామూలే. కృష్ణవంశీ కూడా అందుకు మినహాయింపు కాలేక పోయాడు. మొగుడు, నక్షత్రం, రంగమార్తాండ లాంటి ఫెయిల్యూర్లు ఆయన్ని వెనక్కి లాగేశాయి. రంగమార్తాండకు ముందు ఆయనకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ మరింత పెరిగింది. తన కొత్త సినిమాను ఎంతకీ ప్రకటించడం లేదు. 

ఐతే నిర్మాతలు లేకే కొత్త సినిమా తీయట్లేదని కృష్ణవంశీ ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా సంకేతాలు ఇస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఆయన మరోసారి బయట పెట్టారు. ఒక నెటిజన్ ఒక భారీ కథను నరేట్ చేసే అవకాశం ఇవ్వాలని కృష్ణవంశీని ఎక్స్ ద్వారా కోరాడు.

ఆ కథ కృష్ణవంశీ బలానికి తగ్గ కథ అని, కచ్చితంగా వర్కౌట్ అవుతుందని అన్నాడు. దానికి ఈ లెజెండరీ బదులిస్తూ.. మరి నిర్మాతల మాటేంటి అని ప్రశ్నించాడు. మొగుడు మూవీ పెద్ద డిజాస్టర్ అయిన దగ్గర్నుంచి ప్రతి సినిమాకు నిర్మాతల విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నాడు కృష్ణవంశీ.

ఆయన చివరి చిత్రం  రంగమర్తాండ కూడా మేకింగ్, రిలీజ్ విషయంలో ఇబ్బంది ఎదుర్కొంది. ఆ చిత్రాన్ని ఎవరైనా సోషల్ మీడియాలో కొనియాడినా.. అది సరిగా ఆడలేదని, కాస్ట్ ఫెయిల్యూర్ అని ఓపెన్ గానే చెబుతుంటాడు కృష్ణవంశీ. ఎవరైనా పెద్ద స్టార్లతో సినిమాలు చెయ్యచ్చుగా, భారీ చిత్రాలు తెరకెక్కించవచ్చుగా అని అన్నా.. తనను నమ్మి సినిమాలు చేసే స్టార్లు, నిర్మాతలు ఇప్పుడు లేరని కుండబద్దలు కొడుతుంటాడాయన.

Related Post

ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్ఇచ్చిన హామీ 10 రోజుల ముందే పూర్తి చేసిన పవన్

నెలా పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న హామీని 10 రోజుల ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కోనసీమ

లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!లోకేశ్ దర్బార్..అర కిలోమీటరు క్యూ!

ప్రజా ప్రతినిధి…అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలు ఎన్నుకున్న నేత. తమ నియోజకవర్గం నుంచి గెలిపించి శాసన సభకు పంపితే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి ఆ నేతకు ఓటేస్తారు. అసెంబ్లీలో కావచ్చు…బయట కావచ్చు…తమ ప్రాంత సమస్యలు తీరుస్తారని ప్రజలు