hyderabadupdates.com Gallery లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలోకి వచ్చింది. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మొత్తం టాకీ పార్ట్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఒక షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తి అవుతుందని సమాచారం.

తాజాగా టీమ్ ఆ చివరి షెడ్యూల్‌ కోసం ప్లాన్ సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్‌లో అఖిల్‌పై యాక్షన్ సీన్స్‌తో పాటు ఒక ప్రత్యేకమైన పాటను కూడా చిత్రీకరించనున్నారు. సుమారు పది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా నిర్మించినట్టు తెలుస్తోంది.

ఈ కథ రాయలసీమ నేపథ్యంతో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఇందులో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. అఖిల్, శ్రీలీల జోడీ స్క్రీన్‌పై కొత్తగా, ఫ్రెష్‌గా కనిపించబోతోందని టాక్. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ బాగుంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
The post లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

సీఎం కుర్చీ కోసం ఎలాంటి పోరు లేదుసీఎం కుర్చీ కోసం ఎలాంటి పోరు లేదు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం ఎలాంటి పోరు లేద‌న్నారు. త‌న‌తో పాటు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కూడా సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

    బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా

Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వంTelangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు 1,031 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం