hyderabadupdates.com movies లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలు వచ్చాయి. డెబ్యూ మూవీ హిమాలయ పుత్ర ఫ్లాప్ అయినా సుభాష్ ఘాయ్ తాల్ అప్పట్లో పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత హమ్ రాజ్, బోర్డర్, దివాంగీ, హల్చల్ లాంటివి కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాతే గ్రాఫ్ డౌన్ అయిపోయింది. వరస ఫ్లాపులతో మెల్లగా పోటీలో వెనుకబడ్డాడు. 2008 రేస్ తర్వాత చెప్పుకోదగ్గ బ్రేక్ దక్కలేదు. అడపాదడపా కనిపిస్తున్నా క్రమంగా తెరమరుగైపోయాడు. దృశ్యం 2 ఆయన్ను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది.

కానీ కంబ్యాక్ అవ్వడానికి అది సరిపోలేదు. అయితే 2025 అక్షయ్ ఖన్నాకు భలే కలిసి వస్తోంది. చావాలో ఔరంగజేబు పాత్ర గొప్ప ఖ్యాతి తీసుకురాగా తాజాగా దురంధర్ లో పోషించిన రెహమాన్ బలోచ్ క్యారెక్టర్ కి జనాలు విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. పాకిస్థాన్ లో పేరు మోసిన మాఫియా కం గూండా డాన్ గా అతను చూపించిన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ లో చనిపోయే దాకా అక్షయ్ ఖన్నా డామినేషన్ మాములుగా ఉండదు. కొన్ని సన్నివేశాల్లో ఏకంగా హీరో రణ్వీర్ సింగ్ నే సైడ్ చేసేంత రేంజ్ లో నటన కనబరచడం అతిశయోక్తి కాదు అంత గొప్పగా పేలింది.

సోషల్ మీడియా ట్రెండ్స్ గమనిస్తే అక్షయ్ ఖన్నా ఎంతగా మెప్పించాడో అర్థమవుతుంది. ఇన్నేళ్లు ఎక్కడ ఉండిపోయావంటూ ట్వీట్లు పెడుతున్న వైనం చూడొచ్చు. లేటు వయసులో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఇతన్ని యానిమల్ తో బౌన్స్ బ్యాక్ అయిన బాబీ డియోల్ తో పోల్చొచ్చు. ఎందుకంటే అతను కూడా ఇంచుమించు అక్షయ్ ఖన్నా టైంలోనే వచ్చాడు. ఇద్దరి కెరీర్ గ్రాఫ్ ఒకేలా అప్ అండ్ డౌన్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న తీరూ అలాగే ఉంది. దురంధర్ 2లో కూడా అక్షయ్ ఖన్నా ఉన్నాడు. రణ్వీర్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ లో మరోసారి చూడొచ్చట. ఫ్యాన్స్ దాని కోసమే వెయిట్ చేస్తున్నారు.

Related Post

Nandamuri Balakrishna’s Historical Epic #NBK111 to Launch on this DateNandamuri Balakrishna’s Historical Epic #NBK111 to Launch on this Date

Nandamuri Balakrishna, known as the God of Masses, is ready to begin a new journey with his next big film #NBK111. After delivering back-to-back blockbusters, Balakrishna is now teaming up

Telugu Viral Girl to Romance Dhanush’s Nephew Pavish in His Second FilmTelugu Viral Girl to Romance Dhanush’s Nephew Pavish in His Second Film

Dhanush’s nephew Pavish Narayan was introduced as the lead actor in Nilavukku Enmel Ennadi Kobam (NEEK), which was dubbed in Telugu as Jabilamma Neeku Antha Kopama. Dhanush directed the movie,